మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు మనం అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటాం. ఆహారం విషయానికి వస్తే నాణ్యమైన ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తాం. ఇక బ్రెడ్ విషయానికి వస్తే వైట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్.. రెండింటిలో ఏది కొనాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. అయితే ఈ రెండింటిలో ఏ బ్రెడ్ మంచిది ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది రోజూ రక రకాల బ్రెడ్‌లను తింటుంటారు. వాటిల్లో బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ కామన్. అయితే తెల్ల బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనది. ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్‌ను గోధుమలతో తయారు చేస్తారు. లేదా ఇతర చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలను ఉపయోగిస్తారు. కానీ వైట్ బ్రెడ్ తయారీకి మైదాను వాడుతారు. కనుక వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల బ్రౌన్ బ్రెడ్‌ను తినాల్సి ఉంటుంది. అది మనకు ప్రయోజనాలను అందిస్తుంది.
బ్రౌన్ బ్రెడ్‌లో రక రకాల తృణ ధాన్యాలు కలుస్తాయి. కనుక అందులో ఫైబర్, మెగ్నిషియం, అనేక రకాల విటమిన్లు ఉంటాయి. అందువల్ల బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనది. అది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇక గోధుమలతో చేసే బ్రౌన్ బ్రెడ్‌ను కూడా తీసుకోవచ్చు. అది కూడా మంచిదే. కానీ అన్ని తృణ ధాన్యాలు లేదా చిరు ధాన్యాలతో చేసే మల్టీ గ్రెయిన్ లేదా మిల్లెట్స్ బ్రెడ్‌లను తినడం ఇంకా మంచిది. దీంతో అనేక పోషకాలను పొందవచ్చు. అలాగే శక్తి కూడా లభిస్తుంది.
Trending News :
► ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!
► బ్రౌన్ రైస్ ను నిత్యం తినాల్సిందే.. బ్రౌన్ రైస్ వల్ల కలిగే లాభాలు ఇవిగో..!
► వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నారా ? అయితే జీలకర్ర నీళ్లను తాగండి.. ఇంకా ఎన్నో లాభాలు పొందవచ్చు..!
► శరీరంలో రక్త సరఫరా మెరుగు పడాలంటే.. వీటిని తీసుకోవాలి..!