Jamun Fruit : మనలో చాలా మంది వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు వంటివి వాతావరణ మార్పుల కారణంగా వచ్చాయని వాటిని చాలా మంది తేలికగా భావిస్తూ ఉంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ బారిన పడే వారు ప్రస్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగినంతగా లేనప్పుడు బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను మనం ఆహారంగా తీసుకోవాలి.
మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే వాటిల్లో నేరేడు పండ్లు ఒకటి. నేరేడు పండ్లల్లో ఆంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. నేరేడు పండ్లను మనం ఆహారంగా తీసుకున్నప్పుడు వీటిలో ఉండే ఆంథోసైనిన్స్ యాంటీ బాక్టీరియా ఏజెంట్లుగా పని చేస్తాయి. బాక్టీరియాల వల్ల కలిగే జలుబు, దగ్గు, జ్వరం, అంటు వ్యాధులు, కడుపు నొప్పి వంటి సమస్యల బారిన పడకుండా చేయడంలో నేరేడు పండ్లు ఎంతో సహాయపడతాయి.
రోజుకి 50 గ్రా. ల నేరేడు పండ్లను తినడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జబ్బుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయిని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి వెంటనే పెరుగుతుంది. అంతే కాకుండా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ లకు కారణమయ్యే చెడు కొవ్వు (ఎల్‌డిఎల్)ను తగ్గించడంలో కూడా నేరేడు పండ్లు ఎంతో సహాయపడతాయి. శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వు (హెచ్‌డిఎల్) స్థాయిలను పెంచడంలో నేరేడు పండ్లు ఎంతో సహాయపడతాయి. నేరేడు పండ్లల్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి బాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.