Anjeer: అంజీర్ పండ్ల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ప‌ర‌గ‌డుపునే తినండి.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Anjeer: అంజీర్‌ పండ్లు.. వీటినే అత్తిపండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి మనకు రెండు రకాలుగా లభిస్తాయి. నేరుగా పండ్ల రూపంలో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌గా కూడా తినవచ్చు. అయితే వీటిని నేరుగా కంటే డ్రై ఫ్రూట్స్‌ రూపంలో తినేవారే ఎక్కువ. ఈ క్రమంలోనే అలాంటి వారు ఈ పండ్లను రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

soak anjeer fruit in water at night and eat on empty stomach

 

1. అంజీర్‌ పండ్లలో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, మెగ్నిషియం, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌ కూడా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. ఉదయాన్నే ఈ పండ్లను అలా తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేయవచ్చు.

2. డయాబెటిస్‌ ఉన్నవారు అంజీర్‌ పండ్లను రోజూ తింటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. అంజీర్‌లలో ఉండే ఫైబర్, విటమిన్‌ ఇ, ఫ్యాటీ యాసిడ్లు డయాబెటిస్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి.

3. హైబీపీ ఉన్నవారు రోజూ అంజీర్‌ పండ్లను తింటే ప్రయోజనం ఉంటుంది. వీటిలో పొటాషియం, ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. అందువల్ల హైబీపీ తగ్గుతుంది.

4. చాలా మందికి ఐరన్‌ లోపం ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారు అంజీర్‌ పండ్లను తింటే ప్రయోజనం ఉంటుంది. అంజీర్‌లో ఉండే ఐరన్‌ హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత సమస్య ఉండదు.

5. నీటిలో నానబెట్టిన అంజీర్‌ను ఉదయాన్నే తినడం వల్ల పురుషుల్లో సంతాన లోపం సమస్యలు ఉండవు. వారిలో వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషులు వీటిని పాలతోనూ కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.

Admin

Recent Posts