Breakfast: ఉదయం చాలా మంది రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు చేస్తుంటారు. తమ స్థోమత, సౌకర్యానికి అనుగుణంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అయితే కొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా నేరుగా మధ్యాహ్నం లంచ్ చేస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ను మానేస్తే దాని ప్రభావం బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌పై పడుతుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదా హైపోగ్లైసీమియా రావచ్చు. శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా పడిపోవడాన్ని హైపోగ్లైసీమియా అంటారు. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ను మానేయరాదు.
2. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ను మానేస్తే చిరాకు, ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
3. బ్రేక్‌ఫాస్ట్ ను మానేయడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శరీరం సూక్ష్మ జీవులు, ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తిని కోల్పోతుంది.
4. బ్రేక్‌ఫాస్ట్ ను మానేయడం వల్ల మెటబాలిజం తగ్గుతుంది. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అధికంగా బరువు పెరుగుతారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీలో తెలిపారు. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ను మానేయరాదు.
5. బ్రేక్‌ఫాస్ట్ ను మానేస్తే శరీరానికి శక్తి సరిగ్గా లభించదు. దీంతో అలసట, నీరసం ఎక్కువగా వస్తాయి. అలాగే తలనొప్పి, వికారం, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. కనుక బ్రేక్‌ఫాస్ట్ ను మానేయరాదు.