Black Hair : తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే.. ఇలా చేయాలి.. స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకోండి..!

Black Hair : మ‌న జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం అందంగా క‌న‌బ‌డ‌తాం. మ‌నం అందంగా క‌న‌బ‌డ‌డంలో జుట్టు పాత్ర ఎంతో ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్ల‌బ‌డ‌డం వ‌ల్ల వారు పెద్ద‌వారిలాగా క‌న‌బ‌డ‌తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు తెల్ల‌బ‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. కార‌ణ‌మేదైనా జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డానికి హెయిర్ డై ల‌ను వాడ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాదు.

జుట్టు న‌ల్ల‌గా ఉండాలంటే ముందుగా మ‌న జీవ‌న శైలిలో మార్పు తెచ్చుకోవాలి. దీని వ‌ల్ల మ‌న జుట్టు న‌ల్ల‌గా ఉండ‌డంతోపాటు మ‌న చ‌ర్మ ఆరోగ్యంతోపాటు మ‌న ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. జుట్టు రాలుతుంద‌ని, జుట్టు తెల్ల‌బ‌డుతుంద‌ని చింతించ‌క స‌రైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ‌గా బాధ‌ప‌డ‌డం, ఒత్తిడికి గురి అవ‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డుతుంది. క‌నుక సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉండాలి. అలాగే కొన్ని ప్ర‌త్యేకమైన ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది.

how turn your white hair into Black Hair with these foods
Black Hair

తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు బీన్స్ ను తీసుకోవడం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే మ‌నం ప్ర‌తిరోజూ తీసుకునే ఆహారంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. ఆకుకూర‌ల్లో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు త‌న‌ స‌హ‌జ రంగును కోల్పోకుండా ఉంటుంది. జుట్టును న‌ల్ల‌గా ఉంచ‌డంలో క‌రివేపాకు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. మ‌న వంట‌ల్లో క‌రివేపాకును భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల కూడా చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది.

అదే విధంగా మ‌న ఆహారంలో గుడ్ల‌ను భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది. అంతేకాకుండా గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఎన్నింటినో పొంద‌వ‌చ్చు. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే పండ్ల‌తోపాటు బెర్రీ పండ్ల‌ను అధికంగా తీసుకోవాలి. బెర్రీ పండ్ల‌ను గుజ్జుగా చేసి ఆ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించినా కూడా అధిక ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే తెల్ల జుట్టు స‌మ‌స్య ఉన్న వారు క్యారెట్ జ్యూస్ ను ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది. జుట్టు తెల్ల‌బ‌డిన త‌రువాత దానికి రంగు వేయడానికి బ‌దులుగా న‌ల్లగా జుట్టునే తెల్ల‌బ‌డ‌కుండా చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts