పోష‌కాహారం

Chilli : మిర‌ప‌కాయ‌ల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. కారం ఉన్నా లాగించేస్తారు..!

Chilli : ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా చాలా మంది వాడుతున్న కూర‌గాయ‌ల్లో మిర‌ప‌కాయ‌లు కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ర‌కాల జాతుల‌కు చెందిన మిర‌ప‌కాయ‌లు మ‌న‌కు ల‌భిస్తున్నాయి. ఇవి కొన్ని కారం అదిరిపోయేలా ఉంటాయి. కొన్ని చ‌ప్ప‌గా ఉంటాయి. ఇక ప‌చ్చి మిర్చి, పండు మిర్చి, ఎండు మిర్చి.. ఇలా మిర‌ప‌కాయ‌ల‌ను వాడుతుంటారు. అయితే కారం ఉంటాయ‌ని చెప్పి మిర‌ప‌కాయ‌ల‌ను చాలా మంది తినేందుకు సందేహిస్తుంటారు. కానీ వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎక్క‌డ ఏ నొప్పి ఉన్నా వెంట‌నే త‌గ్గుతుంది. ఎందుకంటే మిర్చిలో ఉండే ప‌లు స‌మ్మేళ‌నాలు నొప్పిని త‌గ్గిస్తాయి. నొప్పికి సంబంధించిన సంకేతాల‌ను మెద‌డుకు చేర‌నివ్వ‌వు. దీంతో నొప్పి అనిపించ‌దు. క్ర‌మంగా నొప్పులు కూడా త‌గ్గుతాయి. అలాగే మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. షుగ‌ర్ ఉన్న‌వారికి మిర‌ప‌కాయ‌లు మంచి మందు అని చెప్ప‌వ‌చ్చు. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. మ‌న పెద్ద‌లు చ‌ద్ద‌న్నంలో రోజూ ప‌చ్చి మిర్చిని నంజుకుని తినేవారు. అందుక‌నే వారికి షుగ‌ర్ లాంటి వ్యాధులు రాలేదు. క‌నుక మిర్చిని ఇలా తింటే షుగ‌ర్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

many wonderful health benefits of chilli

మిర్చిని తిన‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని నిపుణులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల విట‌మిన్ సి, బీటా కెరోటీన్, ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి. ఇవి క్యాన్స‌ర్ కు కార‌ణ‌మ‌య్యే క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఇక మిర‌ప‌కాయ‌ల‌ను తింటే ఎలాంటి ముక్కు దిబ్బ‌డ‌, జ‌లుబు అయినా స‌రే వెంట‌నే త‌గ్గుతాయి. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం మొత్తం క‌రిగి బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీంతో శ్వాస స‌రిగ్గా ఆడుతుంది. శ్వాసకోశ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తం పలుచ‌గా మారుతుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫరాకు ఎలాంటి ఆటంకం ఉండ‌దు. ఫ‌లితంగా ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌దు. దీంతో ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కొవ్వు క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గుతారు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇలా మిర‌ప‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క‌నుక కారంగా ఉన్నా స‌రే మ‌నం రోజూ వీటిని తినాల్సిందే. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts