Watermelon : వేసవికాలం అనగానే ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చకాయ.ఈ కాలంలో ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే పండు కూడా ఇదే.పుచ్చకాయను తినని వారు వుండరు.ఎండాకాలంలో ఈ కాయను తినడం వలన చల్లని ఉపశమనం పొందుతాము.మన శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. పుచ్చకాయ తినడం వలన మన బాడీ డీహైడ్రెషన్ కాకుండా వుటుంది. ఎందుకంటే ఈ కాయలో నీటి శాతం ఎక్కువగా వుంటుంది.దీనిలోదాదాపుగా 92శాతం నీరు వుంటుంది. ఇక ఇవి ప్రస్తుతం మనకు అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటున్నాయి.
అలాగే పుచ్చకాయలో ప్రోటిన్లు, విటమిన్లు, పీచు పదార్థం అనే విలువైన పోషకాలు వుంటాయి.ఇవి మన బాడీకి ఎంతో మేలు చేస్తాయి.ఈ కాయలో వుండే పీచు పదార్థం ఆకలిని నియంత్రిస్తుంది.సులువుగా బరువు తగ్గవచ్చు.డయాబిటీస్ వున్న వారికి ఈ పుచ్చకాయ ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు.శరీరంలోని షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. అయితే,చాలామంది కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్ లో పెడతారు.అలా పెట్టడం వలన కాయలో వుండే విలువైన పోషకాలు నశించిపోతాయి.
అలాగే కెరోటినాయిడ్ స్థాయి కూడా తగ్గిపోతుంది.పుచ్చకాయ బయట చాలా మందంగా వుంటుంది. దీనివలన కాయ త్వరగా చెడిపోదు.సుమారు 10-15 రోజులు వుంటుంది.కాబట్టి ఫ్రిజ్ లో పెట్టనవసరం లేదు.చల్లటి పుచ్చకాయ తినడం వలన దగ్గు, జలుబులు వచ్చే అవకాశం వుంటుంది. ఎక్కువసేపు ఫ్రిజ్ లో పెట్టిన కాయను తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ వుంది.అందుకనే ఎల్లప్పుడూ తాజా పుచ్చకాయనే తినాలి.