హెల్త్ టిప్స్

Health Benefits : క‌రివేపాకుతో చాలా లాభాలు ఉన్నాయి…అవి ఏంటో మీకు తెలుసా..?

Health Benefits : క‌రివేపాకు శాస్త్రీయ నామం ముర్ర‌యి కియిని.ఇది రుటేషియా కుటుంబానికి చెందిన‌ది.ఇది ఎక్కువ‌గా మ‌న ఇండియాలోనే పండుతుంది.చైనా,ఆస్ట్రేలియా,సిలోన్,నైజిరియా దేశాల్లో కూడా క‌రివేపాకు పెంచుతారు.క‌రివేపాకు కేవ‌లం వంట‌ల్లోనే కాదు,వివిధ ర‌కాల ఔష‌ధముల‌లో వాడుతారు.ఇందులో వుండే యాంటిఆక్సిడెంట్లు,మ‌న శ‌రీరానికి చాలా మేలు చేస్తాయి.క‌రివేపాకు తిన‌డం వ‌ల‌న మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మ‌న జీవ‌న విధానం చాలా మారిపోయింది.దీనివ‌ల‌న ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోంటున్నాం,ఎన్నో వ్యాధుల బారిన ప‌డుతున్నాం.అందులో ఒక‌టే డ‌యాబెటిస్.పెద్ద‌వారే కాదు,యువ‌త‌రం కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు.

ర‌క్తంలో షుగ‌ర్ ని కంట్రోల్ చేయ‌డానికి స‌రైన జీవ‌న విధానం చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు.ర‌క్తంలో గ్లూకోజ్ ఎక్కువ‌గా పెరిగితే,ర‌క్తంలో షుగ‌ర్ స్థాయి పెరుగుతుంది.దీనివ‌ల‌న మూత్ర‌పిండాలు,గుండె జ‌బ్బులు,కంటి స‌మ‌స్య‌లు మొద‌లైనవి త‌లెత్తుతాయి.అటువంటి ప‌రిస్థితుల‌లో చ‌క్కెర‌ను నియంత్రించ‌డానికి వివిధ చ‌ర్య‌లు తీసుకుంటారు.క‌రివేపాకు తిన‌డం వ‌ల‌న ర‌క్తంలో షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.అలాగే క‌రివేపాకులో యాంటీ కార్సిజెనిక్,యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ,యాంటీ డయాబెటిక్,హిప‌టో ప్రోట‌క్టివ్ ఎక్కువ‌గా వుంటాయి.ఇవి మ‌న కాలేయానికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి.క‌రివేపాకులో వుండే కారిబాజోలు విరేచ‌నాలను అరిక‌డుతుంది.అలాగే ద‌గ్గు,జ‌లుబుల‌ను ద‌రి చేర‌నివ్వ‌దు.

many wonderful health benefits with curry leaves

ఈ ఆకుల్లో బి1,బి2 విట‌మిన్లు వుంటాయి. ఇవి డ‌యాబిటిస్ ను నియంత్రిస్తుంది. రోజు 10,15 కరివేపాకుల‌ను తిన‌డం వ‌ల‌న ర‌క్తంలో చ‌క్కెర కంట్రోల్ లో వుంటుంది. క‌రివేపాకు పొడిని ఉద‌యం ఒక టీ స్పూన్,సాయంత్రం ఒక టీ స్పూన్ తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న ర‌క్తంలో చ‌క్కెర స్థాయి తగ్గుతుంది.అలాగే జుట్టు ఊడ‌కుండా చాలా స‌హాయ‌ప‌డుతుంది.జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది.ఆకుల ర‌సాన్ని గాయాల ద‌గ్గ‌ర రాయ్యొచ్చు.ఈ ఆకులు అతిసారం,ఎముక‌ల పెరుగుద‌ల‌కు,గ్యాస్ ట్ర‌బుల్,డ‌యాబెటిస్ కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.అందువ‌ల‌న ప్ర‌తి కూర‌ల్లో క‌రివేపాకును వేయాలి.దీనివ‌ల‌న ఆరోగ్యం చాలా మెరుగుప‌డుతుంది.

Admin

Recent Posts