Almonds Benefits : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. బాదం పప్పును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. వైద్యులు కూడా వీటిని తీసుకోమని సూచిస్తూ ఉంటారు. బాదంపప్పును నేరుగా తీసుకోవడం కంటే వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి అధికంగా మేలు కలుగుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు నాలుగు లేదా ఐదు బాదం పప్పులను నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే వీటిపై ఉండే పొట్టును తీసేసి ఈ బాదం పప్పును తినాలి. బాదం పప్పు పొట్టులో ట్యానిక్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. నానబెట్టడం వల్ల బాదం పప్పుపై ఉండే పొట్టు సులభంగా వస్తుంది.
ఈ పొట్టును మనం తీసేసి తింటున్నాం కనుక మన శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయి. అదేవిధంగా నానబెట్టిన బాదం పప్పు సులభంగా జీర్ణమవుతుంది. దీంతో బాదంపప్పులో ఉండే పోషకాలు పూర్తిగా మన శరీరానికి అందుతాయి. బరువు తగ్గడంలో, బీపీ నియంత్రణలో ఉంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, మన శరీరానికి క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో బాదం పప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరానికి బాదం పప్పు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నానబెట్టిన బాదంపప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి.
నానబెట్టిన బాదం పప్పును తీసుకోవడం వల్ల మనకు త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. ఉదయం పూట నానబెట్టిన బాదం పప్పును తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నానబెట్టిన బాదం నుండి లిపేజ్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. ఇది మన అరుగుదల శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఉదయం పూట వీటిని తీసుకోవడం వల్ల త్వరగా ఆహారం మీదకు మన దృష్టి మళ్లకుంగా ఉంటుంది. తద్వారా మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. దీంతో బరువు తగ్గడం కూడా తేలిక అవుతుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో కూడా బాదం పప్పు మనకు సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఇ ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి నష్టం కలగకుండా చేస్తుంది. నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు నానబెట్టిన బాదం గింజలను తినడం వల్ల గర్భస్థ శిశువుకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ విధంగా బాదం పప్పు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.