Cashew Nuts : మనం ఆహారంగా తీసుకునే డ్రైఫ్రూట్స్ లో జీడిపప్పు ఒకటి. వీటిని తీపి వంటకాల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే జీడిపప్పును నేతిలో వేయించి ఉప్పు, కారం చల్లుకుని కూడా తింటూ ఉంటారు. వీటితో రకరకాల తీపి వంటకాలు చేయడంతో పాటు వివిధ రకాల వంటకాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. జీడిపప్పు వంటల రుచి పెంచడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జీడిపప్పు మేలు చేస్తుంది కదా దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. జీడిపప్పును తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలతో పాటు నష్టాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పు రుచిగా ఉంటాయి కాబట్టి అందరూ వీటిని ఇష్టంగా తింటారు. రుచిగా ఉన్నప్పటికి వీటికి మితంగానే తీసుకోవాలి. రోజుకు 5 నుండి 10 జీడిపప్పులను నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. నానబెట్టిన జీడిపప్పులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, సి వంటి విటమిన్స్ తో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం,పొటాషియం, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. నానబెట్టిన జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఏ మాత్రం ఉండదు. జీడిపప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా మారతాయి. అయితే ఈ జీడిపప్పును పగటి పూట ఏ మాత్రం తీసుకోకూడదు. పగటి పూట వీటిని తీసుకోవడం వల్ల జీడిపప్పులో ఉండే కొన్ని రసాయనాలు తలనొప్పిని, గుండెల్లో మంటను కలిగిస్తాచి. కనుక నానబెట్టిన జీడిపప్పును సాయంత్రం పూట లేదా రాత్రి పూట తీసుకోవాలి. జీడిపప్పును తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. జీడిపప్పును తీసుకోవడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో దంతాల నొప్పులు రాకుండా ఉంటాయి. జీడిపప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. జీడిపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. జీడిపప్పులో మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని మనం మితంగానే తీసుకోవాలి. రోజుకు 3 లేదా 5 జీడిపప్పును నీటిలో నానబెట్టి సాయంత్రం పూట తీసుకోవాలి. ఇలా జీడిపప్పును తీసుకోవడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. జీడిపప్పును తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. జీడిపప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు జీడిపప్పును మితంగా తీసుకోవాలి. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం ఇతర మందుల ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది.
బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు కూడా జీడిపప్పును ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అలాగే తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా జీడిపప్పును తక్కువగా తీసుకోవాలి. చాలా మంది తక్కువ ధరకే లభిస్తున్నాయి ముడి జీడిపప్పును కొనుగోలు చేస్తూ ఉంటారు. ముడి జీడిపప్పు ఎలర్జీ, దురద, అజీర్తి వంటి సమస్లయు తలెత్తే అవకాశం ఉంది. కనుక నాణ్యమైన జీడిపప్పును మాత్రమే కొనుగోలు చేసి వాడాలి. జీడిపప్పు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి దీనిని తగిన మోతాదులో వాడడం వల్ల మాత్రమే మనం చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని పిపుణులు చెబుతున్నారు.