Almond Laddu : ఎంతో టేస్టీగా ఉండే బాదం ల‌డ్డూల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Almond Laddu : ల‌డ్డూలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చేందుకు అనేక ర‌కాల ల‌డ్డూలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. బూందీ ల‌డ్డూ, మోతీచూర్ ల‌డ్డూ, డ్రై ఫ్రూట్స్ ల‌డ్డూ.. ఇలా అనేక ల‌డ్డూల‌ను చాలా మంది చేసుకుని తింటుంటారు. ఇవ‌న్నీ మ‌న‌కు స్వీట్ షాపుల్లోనూ ల‌భిస్తుంటాయి. అయితే న‌ట్స్‌తోనూ మ‌నం ల‌డ్డూల‌ను చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా బాదంప‌ప్పుతో చేసే ల‌డ్డూలు ఎంతో తియ్యగా టేస్టీగా ఉంటాయి. అంద‌రికీ ఇవి న‌చ్చుతాయి. వీటిని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే బాదం ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం ల‌డ్డూల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాదం ప‌ప్పు – 2 క‌ప్పులు, చిక్క‌ని పాలు – అర‌ క‌ప్పు, నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు, చ‌క్కెర పొడి – 2 క‌ప్పులు, కొబ్బ‌రి తురుము – 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.

Almond Laddu recipe in telugu very tasty and healthy
Almond Laddu

బాదం ల‌డ్డూల‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా బాదం పప్పులను మిక్సీలో వేసి పౌడర్ గా చేసి పెట్టుకోవాలి. తరువాత ఈ పౌడర్ ను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నేతిలో వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ బాదం మిశ్రమంలో చక్కెర‌ పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలను కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిపై డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన బాదం పప్పు లడ్డూలు తయారైనట్లే. ఇవి అంద‌రికీ ఎంత‌గానో న‌చ్చుతాయి. ముఖ్యంగా చిన్నారులు ఇష్టంగా తింటారు. ఈ ల‌డ్డూలు ఆరోగ్య‌క‌రం కూడా.

Editor

Recent Posts