Jackfruit Seeds : ప్రకృతి ప్రసాదించిన అతి మధురమైన పండ్లల్లో పనస పండ్లు ఒకటి. ఈ పండు చాలా రుచిగా తింటుంది.చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పనస పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. పనస తొనలను ఆహారంగా తీసుకోవడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతూ ఉంటారు. మనం సాధారణంగా పనస తొనలను తిని పనస గింజలను పడేస్తూ ఉంటాం. కానీ పనస తొనలతో పాటు పనస గింజలు కూడా మనకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పనస గింజల్లో కూడాఅనేక రకాల పోషకాల ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
పనస తొనల్లో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, థయామిన్, రైబో ప్లేవిన్, విటమిన్ ఎ, వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. పసన గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణశక్తి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన చాలా సేపటి వరకు ఉంటుంది. దీంతో మనకు ఆకలి త్వరగా వేయకుండా ఉండడంతో పాటు ఇతర చిరుతిళ్లను తినాలన్న ఆలోచనా కలగకుండా ఉంటుంది. తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం బరువు పెరగకుండా ఉండవచ్చు. అంతేకాకుండా పనస గింజలన తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారు పనస తొనలను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ గింజల్లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ గింజల్లో ఉండే పోషకాలు, రసాయనాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనకు మానసిక ప్రశాంతత లభించేలా చేస్తాయి. అదే విధంగా మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో కూడా ఈ గింజలు మనక దోహదపడతాయి. అలాగే ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా ఈ పనస గింజలు మనకు దోహదపడతాయి. అదే విధంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పనస గింజలు మనకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నిరోధించి క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి.
ఈ పనస గింజల వల్ల ఉపయోగాలు ఉన్నప్పటికి రక్తానికి సంబంధించిన మందులను వాడే వారు ఈ గింజలను ఆహారంగా తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ పసన గింజలను పచ్చిగా తినకూడదు. వీటిని ఉడికించి లేదా వేయించి తీసుకోవాలి. ఈ గింజలను వేయించి పొడిగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. అలాగే వీటితో కూరలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా పనస గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.