Soaked Almonds : నాన‌బెట్టిన బాదంప‌ప్పును ఎప్పుడు తీసుకోవాలంటే..?

Soaked Almonds : అధిక మొత్తంలో విట‌మిన్స్ ను, మిన‌ర‌ల్స్ ను, పోష‌కాలను క‌లిగి ఉండే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టని చెప్ప‌వ‌చ్చు. వీటిలో బ‌యోటిస్, విటమిన్ ఇ, విట‌మిన్ బి 12, కాప‌ర్, మెగ్నీషియం, ఫాస్ఫ‌ర‌స్, మాంగ‌నీస్ మ‌రియు ఫైబ‌ర్ ల వంటి ముఖ్య పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. వీటిలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌రియు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. బాదం ప‌ప్పు సుల‌భంగా జీర్ణ‌మ‌వ్వ‌డ‌మే కాకుండా చాలా ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బాదం పప్పును తీసుకోవ‌డం వ‌ల్ల అధిక కొవ్వు కార‌ణంగా వ‌చ్చే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను రాకుండా చేసుకోవ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట నిండిన‌ట్టుగా ఉంటుంది.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఎల్ల‌ప్పుడూ మీతో నాన‌బెట్టిన బాదం గింజ‌ల‌ను ఉంచుకుని వాటిని తింటూ ఉండాలి. నాన‌బెట్టిన బాదం ప‌ప్పులో ఉండే విట‌మిన్ ఇ లు యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌ని చేసి ఫ్రీ రాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే ప్ర‌మాదాల నుండి ఇన్ ఫెక్ష‌న్ ల నుండి కాపాడ‌తాయి. క‌నుక ప్ర‌తిరోజూ నాలుగు లేదా ఐదు బాదం ప‌ప్పుల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే అల్ఫాహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప్ర‌తిరోజూ బాదం ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల గుండె బ‌లంగా త‌యార‌వుతుంది. మ‌న శ‌రీరంలో జీవ‌క్రియ రేటు పెరిగి అనేక వ్యాధుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. నాన‌బెట్టిన బాదం ప‌ప్పులు సుల‌భంగా జీర్ణం అవుతాయి. త‌ద్వారా వాటిలో ఉండే పోష‌కాలన్ని శ‌రీరానికి అందుతాయి. బాదంప‌ప్పుల‌ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల వాటి రుచి మ‌రింత పెరుగుతుంది.

Soaked Almonds what is the best time to take them for maximum benefits Soaked Almonds what is the best time to take them for maximum benefits
Soaked Almonds

ప్ర‌తిరోజూ బాదం ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డి జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. చ‌ర్మాన్ని నిగ‌నిగ‌లాడేలా చేసే శ‌క్తి కూడా బాదం ప‌ప్పుకు ఉంది. బాదం ప‌ప్పుతో ఫేస్ ఫ్యాక్ ను వేసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మానికి కావ‌ల్సిన పోష‌కాలు అంది చ‌ర్మం ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. ఎటువంటి చ‌ర్మ‌త‌త్వం ఉన్న వారికైనా బాదం ఫేస్ ప్యాక్ లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ ఫేస్ ఫ్యాక్ ను త‌యారును చేసుకోవ‌డానికి గానూ మ‌నం బాదం ప‌ప్పుల పేస్ట్, పాలు, ఓట్స్ మీల్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో పాల‌ను తీసుకోవాలి. త‌రువాత రాత్రంతా నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను పేస్ట్ గా చేసి వేసుకోవాలి. త‌రువాత పాల‌లో నాన‌బెట్టిన ఓట్స్ ను పేస్ట్ గా చేసి వేసుకోవాలి. వీట‌న్నింటిని బాగా క‌లిపి ముఖానికి, మెడ‌కు ప్యాక్ లా వేసుకోవాలి.

అర‌గంట త‌రువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది. అలాగే నాన‌బెట్టిన బాదం ప‌ప్పులను పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ లో ప‌సుపు క‌లిపి ముఖానికి రాసుకోవాలి. అర‌గంట త‌రువాత నీటితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే మొటిమ‌లు, మ‌చ్చలు త‌గ్గి ముఖం అందంగా త‌యార‌వుతుంది. ఈ విధంగా బాదం ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి, మ‌న సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, నాన‌బెట్టిన బాదం ప‌ప్పును ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts