Carrot Beetroot Chips : క్యారెట్, బీట్‌రూట్. మనకు అందుబాటులో ఉండే కూరగాయలే. ఇవి ఏడాది పొడవునా మనకు లభిస్తాయి. వీటిని కొందరు నేరుగా తింటారు. కొందరు జ్యూస్‌ల రూపంలో చేసుకుని తాగుతుంటారు. ఇంకొందరు కూరల్లో వేస్తుంటారు. అయితే వీటితో చిప్స్ కూడా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్, బీట్‌రూట్ చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్లు – మూడు, బీట్ రూట్ – చిన్నవి మూడు, నూనె – తగినంత, ఉప్పు – రెండు టీస్పూన్లు.
క్యారెట్, బీట్‌రూట్ చిప్స్‌ను తయారు చేసే విధానం..
క్యారెట్, బీట్‌రూట్‌లను వృత్తాకారంలో పలుచని ముక్కలుగా కోయాలి. ఓ బాణలిలో నూనె వేసి కాగాక వీటిని వేయించాలి. ఈ చిప్స్ వేడిగా ఉన్నప్పుడే ఉప్పును చిలకరిస్తే చాలు. ఎంతో రుచికరమైన క్యారెట్, బీట్‌రూట్ చిప్స్ రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా అన్నం, రోటీ, చపాతీ వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండడమే కాదు.. అందరికీ నచ్చుతాయి.