Cardamom Water Benefits : వంటల తయారీలో మనం ఎన్నో రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తూ ఉంటాం. మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో యాలకులు ఒకటి.యాలకులు చక్కటి సువాసనను కలిగి ఉంటాయి. వంటల్లో వీటిని వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. యాలకుల్లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ఎంతో కాలంగా యాలకులను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారని మనకు ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తుంది. యాలకులకు కీమో థెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించే శక్తి ఉందని పరిశోధనల ద్వారా నిరూపితమైంది. యాలకులను ఉపయోగించి ఉదర సంబంధిత సమస్యలైనా అజీర్తి, మలబద్దకం, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు.
అలాగే శ్వాస సంబంధిత సమస్యలైనా అస్థమా, జలుబు, పైనప్ వంటి వ్యాధులను తగ్గించడంలో కూడా యాలకులు మనకు ఎంతగానో సహాయపడతాయి. కలరా, తలనొప్పికి సంబంధించిన చికిత్సల్లో కూడా యాలకులను వాడతారు. యాలకుల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ యాలకులు యాంటీ ఆక్సిడెంట్లను, యాంటీ సెప్టిక్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. యాలకులను నీళ్లల్లో వేసి మరిగించి వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణ సమస్యలను, దంత సమస్యలను, నోటి అల్సర్లను, డిప్రెషన్ వంటి సమస్యలను యాలకులను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. గోరు వెచ్చని యాలకుల నీటిని రోజూ ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి.
ఈ నీటిని తాగడం వల్ల మూత్ర పిండాలు, మూత్రాశయం శుభ్రపడుతుంది. ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. రోజూ యాలకుల నీటిని తాగడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాలకుల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. గుండె కొట్టుకోవడాన్ని యాలకులు క్రమబద్దీకరిస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. కమ్మటి రుచిని, సువాసనను కలిగి ఉండే యాలకుల గింజలను నోట్లో వేసుకోవడం వల్ల మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండవచ్చు. వీటిని తినడం అలవాటు చేసుకుంటే చెడు అలవాట్లను దూరం పెట్టవచ్చు.
యాలకుల్లో ఉండే విటమిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఫైటో న్యూట్రియంట్స్ గా , యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను దూరం చేస్తాయి. గోరు వెచ్చని యాలకుల నీటిని రోజూ తీసుకోవడం వల్ల డిప్రెషన్ రాకుండా ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల వాంతులు, వికారం, గ్యాస్, ఎసిడిటి సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. యాలకుల నీటిని తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. యాలకుల నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. తద్వారా మనం త్వరగా బరువు తగ్గవచ్చు. గొంతునొప్పిగా ఉన్నప్పుడు గోరు వెచ్చని యాలకుల నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. యాలకుల నీటిని తాగడం వల్ల ఎముకలు ధృడంగా అవుతాయి.
అలాగే ప్రతిరోజూ రాత్రి పాలల్లో యాలకుల పొడిని వేసి తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఈ పాలల్లో యాలకుల పొడితో పాటు తేనె, పసుపును కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. యాలకులను నోట్లో వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. యాలకుల నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం అందంగా మెరుస్తూ ఉంటుంది. జుట్టును ఒత్తుగా, నిగనిగలాడుతూ ఉండేలా చేసే శక్తి కూడా యాలకులకు ఉంది. శరీరంలో అన్ని ప్రక్రియలు సజావుగా సాగేలా చేయడంలో యాలకులు ఎంతగానో దోహదపడతాయి. యాలకుల నీటిని తాగడం వల్ల అలాగే యాలకులను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని యాలకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.