న‌ట్స్ & సీడ్స్

Cashew Nuts : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎట్టిప‌రిస్థితిలోనూ అస‌లు జీడిప‌ప్పును తిన‌వ‌ద్దు..!

Cashew Nuts : జీడిపప్పు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు..? చాలా మందికి జీడిపప్పు ఫేవరెట్. జీడిపప్పుని తింటే ఎన్నో రకాల లాభాలని పొందొచ్చు. చాలా రకాల పోషక పదార్థాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పును తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. పరగడుపున జీడిపప్పును తింటే మాత్రం కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు జీడిపప్పుని తీసుకోకూడదు. జీడిపప్పుని తీసుకోవడం వలన ఇబ్బందులు పడతారు.

జీడిపప్పులో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దానితోపాటుగా మెగ్నీషియం, కాపర్, జింక్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, సెలీనియం కూడా జీడిపప్పులో ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు జీడిపప్పుని అస్సలు తీసుకోకూడదు. జీడిపప్పుని వాళ్ళు తీసుకోవడం వలన రక్తపోటు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పులో సోడియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటు పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు ఉంటే కూడా జీడిపప్పును తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే సమస్య ఏర్ప‌డుతుంది.

these people should not take cashew

జీడిపప్పులో అధికంగా ఫైబర్ ఉండడం వలన గ్యాస్ సమస్యల్ని బాగా పెంచేస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా జీడిపప్పుకి దూరంగా ఉండాలి. పొటాషియం ఇందులో ఎక్కువ ఉండటం వలన కిడ్నీ సమస్యలను ఇంకొంచెం పెంచేస్తుంది. దాంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రోజూ ఎంత జీడిపప్పు తినొచ్చు అనే విషయానికి వస్తే.. ఆరోగ్యంగా ఉండే వాళ్ళు నాలుగు నుండి ఐదు జీడిపప్పుల్ని తీసుకోవచ్చు. కానీ సమస్యలు ఏమైనా ఉన్నవాళ్లు డాక్టర్‌ని అడిగి డాక్టర్ చెప్పినట్లు పాటించడం మంచిది.

లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. జీడిపప్పుని చాలామంది టైంపాస్ కి తీసుకుంటూ ఉంటారు. జీడిపప్పును వేయించి ఉప్పు, మసాలా వేసుకుని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మసాలా వంటి వాటిని జీడిపప్పుతోపాటు తీసుకుంటే పలు సమస్యలు కలుగుతాయి. కాబట్టి కేవలం జీడిపప్పును మాత్ర‌మే తీసుకోవడం మంచిది.

Share
Admin

Recent Posts