Peanuts : మాంసం, గుడ్ల క‌న్నా 10 రెట్ల శ‌క్తినిచ్చే ప‌ల్లీలు.. చాలా మందికి తెలియ‌దు.. ఎప్పుడు ఎలా తినాలంటే..?

Peanuts : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో ప‌ల్లీలు ఒక‌టి. ఇవి ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉంటాయి. ప‌ల్లీల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తాం. ప‌ల్లీల‌ను ఉప‌యోగించి చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. ప‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌ల్లీల్లో ఉండే విట‌మిన్స్ మ‌నం ఆరోగ్యంగా ఉండేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే శ‌రీరంలో మెట‌బాలిజాన్ని పెంచ‌డంలో కూడా ఇవి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప‌ల్లీల్లో పుష్క‌లంగా ఉండే క్యాల్షియం ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో తోడ్ప‌డుతుంది.

అయితే ఈ ప‌ల్లీల‌ను మితంగానే తీసుకోవాలి. వీటిని అధిక మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ప‌ల్లీల‌ను ఏవిధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వేరు శ‌న‌గ కాయ‌ల‌ను ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. అలాగే మార్కెట్ లో దొరికే ప‌చ్చి ప‌ల్లీల‌ను నీటిలో రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి. వీటిని మొల‌కెత్తించి తీసుకున్నా కూడా మ‌నం చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మాంసంలో కంటే ప‌ల్లీల్లో 50 శాతం ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి.

what is the best time to take Peanuts
Peanuts

ఇలా నాన‌బెట్టిన ప‌ల్లీల‌తో పాటు బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు మాత్రం కేవ‌లం ప‌ల్లీల‌నే ఆహారంగా తీసుకోవాలి. ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవకాశం త‌క్కువ‌గా ఉంటుంది. ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస కోస సంబంధిత స‌మ‌స్య‌ల నుండి, ఇన్ఫెక్ష‌న్ ల నుండి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది. ద‌గ్గు, జ‌లుబుల‌తో బాధ‌ప‌డే వారు వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఎదుగుతున్న పిల్ల‌ల‌కు కూడా ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది.

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే మ‌చ్చ‌లు తొలగిపోయి చ‌ర్మం అందంగా కాంతివంతంగా త‌యారవుతుంది. నాన‌బెట్టిన ప‌ల్లీల‌తో పాటు బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భించి నీర‌సం త‌గ్గుతుంది. వీటిలో ఉండే పోష‌కాలు శ‌రీరాన్ని అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధుల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో కూడా ప‌ల్లీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ప‌ల్లీలు, బెల్లాన్ని క‌లిపి తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డుతుంది. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. రోజుకో గుప్పెడు నాన‌బెట్టిన ప‌ల్లీల‌ను, బెల్లాన్ని క‌లిపి తిన‌డం వల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts