Ragulu : వీటిని తీసుకుంటే చాలు.. ట‌న్నుల కొద్దీ బ‌లం వ‌స్తుంది.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..

Ragulu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో రాగులు ఒక‌టి. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మన‌కు తెలిసిందే. రాగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా షుగ‌ర్ వ్యాధి రాకుండా అరిక‌ట్ట‌డంలో రాగులు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఇత‌ర ధాన్యాల కంటే రాగులు మ‌రింత దోహ‌ద‌ప‌డతాయి. రాగుల‌ను అధికంగా వాడ‌డం వ‌ల్ల షుగ‌ర్ బారిన ప‌డే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గ ఉంటాయిని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. రాగుల్లో ఫైటో కెమిక‌ల్స్, ఫాలీ ఫినాల్స్, టానిన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి రాగుల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ ను త్వ‌ర‌గా ర‌క్తంలో క‌ల‌వ‌కుండా అలాగే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త్వ‌ర‌గా పెర‌గకుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ అజీర్తి, మ‌ల‌బద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌ను త‌గ్గించ‌డంలో కూడా రాగులు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. వృద్ధాప్య ల‌క్ష‌ణాలు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మ‌రింత మెరుగుప‌డుతుంది. అలాగే శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను క‌రిగించి గుండె ఆరోగ్యం మెరుగుప‌డేలా చేయ‌డంలో, ఊబ‌కాయం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో కూడా రాగులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బాలింత‌లు, గ‌ర్భిణీ స్త్రీలు రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Ragulu benefits in telugu must take them daily
Ragulu

శ‌రీరంలో దెబ్బ‌తిన్న క‌ణాల‌ను బాగు చేయ‌డంలో శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో కూడా రాగులు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌డంతో పాటు అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. రాగుల‌తో దోశ‌లు, రోటీ, సంగ‌టి వంటి వాటిని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts