Winter Foods : కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ క్రమంలోనే కాలానికి అనుగుణంగా మనం ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఏ విధమైన జబ్బుల బారిన పడే ప్రమాదం ఉండదు. మరి శీతాకాలంలో ఏ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.. అనే విషయాలను గురించి తెలుసుకుందాం.
1. శీతాకాలంలో ఎక్కువగా సొరకాయ, బెండకాయ, బీరకాయ, గుమ్మడి కాయ, పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి.
2. మొక్క జొన్నలు, గోధుమ, చికెన్, మటన్, చేపలు, రొయ్యలను అధికంగా తీసుకోవాలి.
3. పండ్ల విషయానికి వస్తే ద్రాక్ష, యాపిల్, కమలా, పైనాపిల్, అరటి వంటి పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం.
4. శీతాకాలంలో పాలతో పాటు పాల పదార్థాలను అధికంగా తీసుకోవాలి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ ను అధికంగా తీసుకోవడం ఎంతో ఉత్తమం.
5. అలాగే శీతాకాలంలో స్నానాలకు గోరువెచ్చని నీటిని వాడాలి. ఈ విధమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ జాగ్రత్తలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు.