Beerakaya : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. బీరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బీరకాయ కూర, బీరకాయ పప్పు, పచ్చడి ఇలా రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బీరకాయతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది బీరకాయలను తినడానికి ఇష్టపడరు. కానీ బీరకాయలను తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బీరకాయలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్స్, విటమిన్స్ వంటి వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
వారానికి రెండు సార్లు బీరకాయలను తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బీరకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బీరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మద్యపానం సేవించే వారు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు వారానికి రెండు సార్లు బీరకాయలను తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే దీనిలో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు బీరకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరరీంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో బీరకాయ మనకు ఎంతో సహాయపడుతుంది.
మహిళలు ముఖ్యంగా బీరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల వారిలో రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుంది. అదే విధంగా వారానికి రెండు సార్లు బీరకాయను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా బీరకాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహంతో బాధపడే వారు బీరకాయను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. బీరకాయను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరం యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బీరకాయ మనకు ఎంతో సహాయపడుతుంది. బీరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తప్పకుండా వారానికి రెండు సార్లు ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.