Gongura: గోంగూర‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసుకోండి..!

Gongura: మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకు కూర‌ల్లో గోంగూర ఒక‌టి. దీన్నే తెలంగాణ‌లో పుంటి కూర అని పిలుస్తారు. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. గోంగూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో ఎక్కువ‌గా ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటివి చేసుకుంటారు. దీన్ని నిల్వ ప‌చ్చ‌డిగా కూడా చేస్తారు. గోంగూర వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

gongura prayojanalu

 

1. గోంగూర‌లో కాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ’, ‘సి’, రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, పీచు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐరన్‌ అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది.

2. గోంగూర ఆకుల‌ను తీసుకుని వాటిపై కొద్దిగా ఆముదం రాయాలి. ఆ ఆకుల‌ను వేడి చేసి గ‌డ్డ‌ల‌పై ఉంచాలి. క‌ట్టులా క‌ట్టాలి. దీంతో అవి క‌రిగిపోతాయి. నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

3. రేచీక‌టి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు గోంగూర‌ను త‌ర‌చూ తింటుంటే ఫ‌లితం ఉంటుంది. అలాగే గోంగూర పూలను దంచి అరకప్పు రసం చేసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించాలి. ఇలా కూడా ఆ స‌మ‌స్య త‌గ్గుతుంది.

4. గోంగూర, వేపాకుల‌ను క‌లిపి నూరి ముద్ద‌గా చేసి ఆ మిశ్ర‌మాన్ని బోద‌కాలుపై రాయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే బోద‌కాలు త‌గ్గుతుంది. అలాగే నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి త‌గ్గుతుంది.

5. గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు త‌గ్గుతాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరతో అన్నం తిన్నా విరేచనాలు తగ్గిపోతాయి.

6. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదో విధంగా తీసుకుంటే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

7. గోంగూర‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. రేచీక‌టిని త‌గ్గిస్తుంది. అధిక బ‌రువు ఉన్న‌వారు గోంగూర‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం మంచిది.

8. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఒక క‌ప్పు గోంగూరను తీసుకుంటే మ‌న‌కు రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సి లో 53 శాతం వ‌ర‌కు ల‌భిస్తుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

9. గోంగూర ఆకుల‌ను పేస్ట్‌లా చేసి రాస్తుంటే గ‌జ్జి, తామ‌ర త‌గ్గుతాయి. గోంగూర‌ను త‌ర‌చూ ఆహారంలో తీసుకుంటే నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది.

10. గోంగూర ఆకుల పేస్ట్‌ను త‌ల‌కు ప‌ట్టించి కొంత సేపు అయ్యాక స్నాన చేయాలి. దీంతో జుట్టు రాల‌డం, చుండ్రు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌హిళ‌లు రుతు స‌మ‌యంలో గోంగూర‌ను తీసుకుంటే శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది.

సూచ‌న‌: గోంగూర మంచిదే అయిన‌ప్ప‌టికీ అల‌ర్జీలు ఉన్న‌వారు, శ‌రీరంలో వేడి అధికంగా ఉన్న‌వారు, వాతం ఉన్న‌వారు దీన్ని తిన‌రాదు.

Admin

Recent Posts