కూర‌గాయ‌లు

ఎంతో రుచికరమైన ఆగాకరకాయలు.. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి..!

ఆగాకర కాయలు.. చూసేందుకు కాకరకాయలను పోలిన ఆకారాన్ని కలిగి ఉంటాయి. కానీ ఇవి కాకరకాయల్లా చేదుగా ఉండవు. భలే రుచిగా ఉంటాయి. వీటితో చాలా మంది వేపుడు చేసుకుంటారు. కొందరు వీటిని టమాటాలతో కలిపి వండి తింటారు. ఈ క్రమంలోనే వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of agakara kaya

1. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ఈ కాయలు ఎంతగానో దోహదపడతాయి. వంద గ్రాముల ఆగాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో క్యాలరీలు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తాయి.

2. ఈ కాయల్లో ఫైబర్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల గర్భిణీలకు ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. వారిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

3. ఈ కాయల్లో ఫోలేట్‌ అధికంగా ఉంటుంది. ఇది కొత్త కణాల వృద్ధికి, గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది.

4. గర్భిణీలు రెండు పూటలా భోజనంలో వీటి కూరను తింటే దాదాపుగా వంద గ్రాముల ఫోలేట్‌ లభిస్తుంది. దీంతో వారికి మేలు జరుగుతుంది.

5. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఆగాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిలను పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది.

6. ఈ కాయల్లో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు లివర్‌, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.

7. ఈ కాయలను తరచూ తీసుకోడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే క్యాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.

8. ఆగాకరకాయల్లోని విటమిన్‌ సి శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాటం చేస్తుంది. ఈ కాయల్లో ఫ్లేవనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

9. ఈ కాయల్లో లభించే విటమిన్‌ ఎ కంటి చూపును పెంచుతుంది. మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు ఈ కాయల కూరను తింటుంటే ప్రయోజనం కలుగుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts