వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది శరీరాన్ని చల్ల బరుచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. కొందరు శరీరాన్ని చల్లగా ఉంచేందుకు పలు ప్రత్యేకమైన ఆహారాలను తీసుకుంటారు. కొందరు పండ్లను తింటారు. అయితే కీరదోస కూడా అందుకు చక్కగా పనిచేస్తుంది. పైగా ఈ సీజన్‌లో ఇవి మనకు బాగా లభిస్తాయి. ధర కూడా తక్కువే ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
1. కీరదోసలో పోషకాలు పుష్కలంగా, క్యాలరీలు చాలా స్వల్పంగా ఉంటాయి. 300 గ్రాముల కీరదోసను తిన్నా మనకు కేవలం 45 క్యాలరీలే లభిస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు రోజూ దీన్ని ఆహారంలో కచ్చితంగా చేర్చుకోవాలి. ఇక 300 గ్రాముల కీరదోస ద్వారా పిండి పదార్థాలు 11 గ్రాములు, ప్రోటీన్లు 2 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, విటమిన్ సి 14 శాతం (రోజులో కావల్సిన దాంట్లో), విటమిన్ కె 62 శాతం, మెగ్నిషియం 10 శాతం, పొటాషియం 13 శాతం, మాంగనీస్ 12 శాతం లభిస్తాయి. అందువల్ల కీరదోసను తింటే శరీరానికి పోషణ లభిస్తుందని చెప్పవచ్చు.
2. కీరదోసలో 96 శాతం వరకు నీరే ఉంటుంది. అందువల్ల వేసవిలో నీరు లభించకపోతే వీటిని తినవచ్చు. నీటికి ప్రత్యామ్నాయంగా కీరదోసను తినవచ్చు. దీంతో శరీరానికి తగినంత నీరు లభిస్తుంది. ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. శరీరం చల్లగా ఉంటుంది.
3. కీరదోసలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరరీంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. క్యాన్సర్, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు రావు.
4. కీరదోసను తినడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉండి శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గేందుకు ఇది సహాయ పడుతుంది.
5. డయాబెటిస్ ఉన్నవారు కీరదోసను రోజూ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. కీరదోస వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
6. మలబద్దకం సమస్య ఉన్నవారు రాత్రి పూట కీర దోసను తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. భోజనం అనంతరం కీరదోసను తినాలి. దీంతో మరుసటి రోజు సుఖంగా విరేచనం అవుతుంది. మలబద్దకం సమస్య ఉండదు.
7. కీరదోసను తినడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది. అలసిపోయిన వారు కీరదోసను తింటే శరీరం చురుగ్గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. అందుకు కావల్సిన తాజాదనాన్ని కీరదోస అందిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365