షుగ‌ర్ త‌గ్గేందుకు మెంతుల‌ను ఏవిధంగా తీసుకోవాలంటే..?

డయాబెటిస్ ఉన్న‌వారు తాము తినే ఆహారం, అనుసరించే జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో డయాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు కోవిడ్ రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది, క‌నుక వారు షుగ‌ర్ స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవాలి. ఈ క్ర‌మంలోనే నిత్యం త‌గిన శారీర‌క శ్ర‌మ ఉండేలా చూసుకోవాలి. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేసేవారు మ‌రింత జాగ్ర‌త్త వ‌హించాలి. అధికంగా క్యాల‌రీలు ఉండే ఆహారాల‌ను తీసుకోరాదు. త‌క్కువ క్యాల‌రీలు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ఇక షుగ‌ర్ స్థాయిల‌ను త‌గ్గించేందుకు మెంతులు కూడా అద్భుతంగా ప‌నిచేస్తాయి. మెంతుల‌ను రోజూ ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది.

how to take fenugreek seeds or leaves to control sugar levels

మెంతుల‌లో సోడియం, జింక్, ఫాస్ఫ‌ర‌స్‌, ఫోలిక్ ఆమ్లం, ఇనుము, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్లు ఎ, బి, సి, ఇత‌ర‌ ఖనిజాలు ఉంటాయి. ఇవి కాకుండా ఫైబర్‌, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల‌ను నియంత్రించడంతోపాటు బరువును తగ్గిస్తాయి. అలాగే అనేక వ్యాధుల నుండి రక్ష‌ణ‌ను అందిస్తాయి.

మెంతులను ఎలా తీసుకోవాలి ?

డయాబెటిస్ ఉన్న‌వారు మెంతుల‌ను అనేక విధాలుగా తీసుకోవచ్చు. వీటిని రోజూ తినే ఆహారంలో భాగంగా తీసుకోవ‌చ్చు. లేదా రాత్రిపూట నీటిలో గుప్పెడు మెంతుల‌ను నానబెట్టి తరువాత రోజు ఉద‌యాన్నే తినవచ్చు. అలాగే మెంతుల‌నె మొల‌కెత్తించి కూడా తీసుకోవ‌చ్చు. అందుకు గాను రాత్రి పూట గుప్పెడు మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యం వాటిని తీసి శుభ్ర‌మైన వ‌స్త్రంలో క‌ట్టి పెట్టాలి. దీంతో 1-2 రోజుల్లో మెంతులు మొల‌కెత్తుతాయి. వాటిని తిన‌వ‌చ్చు.

ఇత‌ర ఆకుకూర‌ల్లాగే మెంతి ఆకు కూడా మార్కెట్‌లో మ‌న‌కు ల‌భిస్తుంది. దీన్ని తీసుకున్నా షుగ‌ర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మెంతుల్లో ఉండే 4-హైడ్రాక్సీ సోలుసిన్ అన‌బ‌డే అమైనో ఆమ్లం ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. అందువ‌ల్ల డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఇక మెంతుల‌ను ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి ఉడికించి తీసుకోవ‌చ్చు. లేదా ప‌రాఠాలు త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఓట్స్‌తో క‌లిపి వండుకుని కూడా తిన‌వ‌చ్చు. ఎలా తీసుకున్నా మెంతుల వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts