Kasara Kayalu : పొలాలు, చేల గ‌ట్ల మీద ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కనిపించే కాయ‌లు.. ఇవి తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

Kasara Kayalu : కాస‌ర కాయ‌లు.. ఇవి తెలియ‌ని గ్రామీణులు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కాస‌ర కాయ‌లు సంవ‌త్స‌రంలో మూడు నెల‌ల పాటు మాత్ర‌మే లభిస్తాయి. ఇవి మ‌న‌కు వ‌ర్షాకాలంలో మాత్ర‌మే ల‌భిస్తాయి. కాస‌ర కాయ తీగ‌లు ఎక్కువ‌గా కాలువ గట్ల‌పై, రోడ్ల‌కు ఇరు వైపులా, ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని పెరుగుతూ ఉంటాయి. అయితే ప్ర‌స్తుత కాలంలో కాస‌ర‌కాయ‌లు చాలా త‌క్కువగా ల‌భిస్తున్నాయి. ఈ కాస‌ర కాయ‌లు చూడ‌డానికి చిన్న కాక‌ర‌కాయ‌ల్లా ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాంల్లో చిన్న కాక‌ర‌కాయ‌లు అని కూడా అంటారు. వీటిని రుచి చూసిన వారు ఈ కాయ‌ల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు. ఎక్కువ‌గా ఈ కాయ‌ల‌తో కారాన్ని, కూర‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ కాస‌ర కాయ‌ల‌తో చేసే కారం చాలా రుచిగా ఉంటుంది.

అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కాస‌ర‌కాయ‌ల్లో పోష‌కాల‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ కాయ‌ల్లో ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. ఫైబ‌ర్, విట‌మిన్ సి, క్యాల్షియం, బీటా కెరోటీన్, ఐర‌న్, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ కాస‌ర కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుందని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. కాస‌ర కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు ధృడంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి.

Kasara Kayalu health benefits in telugu know about them
Kasara Kayalu

అలాగే కాస‌ర‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. వ‌ర్షాకాలంలో వీటిని త‌ప్పకుండా తీసుకోవాల‌ని నిపుణులు సైతం సూచిస్తున్నారు. అలాగే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించి శ‌రీరంలో ర‌క్త‌వృద్దిని క‌లిగించ‌డంలో కూడా కాస‌ర‌కాయ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి కాలేయ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా కాస‌ర‌కాయ‌లు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే కాస‌ర‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కాస‌ర‌కాయ‌ల‌తో కూర‌ను లేదా వెల్లుల్లి వేసి కారం త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి జూన్, జులై, ఆగ‌స్ట్ నెలల్లో మాత్ర‌మే ల‌భిస్తాయి క‌నుక ఇవి లభించే కాలంలోనే ఎక్కువ‌గా తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఈ విధంగా కాస‌ర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts