కూరగాయల గురించిన ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

నిత్యం మనం తినే కూరగాయలు, ఆకు కూరల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవన్నీ మన శరీరానికి ఉపయోగకరమైనవే. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. కూరగాయలు, ఆకుకూరల్లో మన శరీరాన్ని అన్ని విధాలుగా సమతుల్యం చేసే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ ఉంటాయి.

kuragayalu asakthikaramaina visheshalu

 

* కాలిఫ్లవర్‌లో కోలిన్‌ అనబడే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని అమాంతం పెంచుతుంది. అందువల్ల దీన్ని చిన్నారులకు ఇస్తే మంచిది. దీని వల్ల వారి మెదడు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చదువుల్లో రాణిస్తారు.

* ఒక నారింజ పండులో ఉండే విటమిన్‌ సికి రెట్టింపు స్థాయిలో విటమిన్‌ సి ఒక క్యాప్సికంలో ఉంటుంది. అందువల్ల దీంతో శరీరో నిరోధక శక్తి పెరగడమే కాదు, కొవ్వు కూడా కరుగుతుంది.

* పుదీనాలో రోజ్‌మరినిక్‌ యాసిడ్‌, మెథనాల్‌ అనే సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల డిప్రెషన్‌, అలర్జీలు తగ్గుతాయి.

* పాలకూరలో ఐరన్‌ కన్నా ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గర్భిణీలకు ఇది చాలా మేలు చేస్తుంది. వారికి ఫోలిక్‌ యాసిడ్‌ చాలా అవసరం ఉంటుంది. కనుక వారు పాలకూరను నిత్యం తినాలి.

* పచ్చి బఠానీల్లో ఎల్‌-అర్జైనైన్‌ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది వెజిటేరియన్‌ ఆహారాలను మాత్రమే తినేవారికి ఉత్తమమైన ప్రోటీన్‌గా పనిచేస్తుంది. ప్రోటీన్లు కావాలనుకునే శాకాహారులు పచ్చి బఠానీలను తినవచ్చు. దీంతో శరీరానికి శక్తి కూడా లభిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts