ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ అంటే ఏమిటి ? వేటిని తినాలి ?

నిత్యం చాలా మంది స్నాక్స్‌ పేరు చెప్పి బిస్కెట్లు, చిప్స్‌, ఇతర నూనెతో చేసిన పదార్థాలను తింటుంటారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారమవుతాం. అందువల్ల ఎవరైనా సరే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తినాల్సి ఉంటుంది. మరి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ అంటే ఏమిటి ? వేటిని తినాలి ? అంటే…

1. డ్రై ఫ్రూట్స్‌, సీడ్స్‌

arogyamga undenduku snacks

బాదంపప్పు, బ్లాక్‌ రైజిన్స్‌ (నల్ల ద్రాక్ష కిస్మిస్‌), పిస్తా, వాల్‌నట్స్‌, అంజీర్‌ వంటి డ్రై ఫ్రూట్స్‌ను స్నాక్స్‌ రూపంలో తినవచ్చు. వీటి వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

2. ప్రోటీన్‌ బార్స్‌

వీటిని ఓట్స్‌, తేనె, ఇతర సీడ్స్‌తో తయారు చేస్తారు. కనుక ఇవి మనకు శక్తిని ఇస్తాయి. వీటిని తినడం వల్ల అలసిపోకుండా ఉంటారు. కావల్సినంత శక్తి లభిస్తుంది. ఇవి కూడా చక్కని స్నాక్స్‌లా పనికొస్తాయి.

3. మఖనా

స్నాక్స్‌ రూపంలో వీటిని కూడా తినవచ్చు. వీటిల్లో ఫైబర్‌ (పీచు పదార్థం), మెగ్నిషియం, పొటాషియంలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరం. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. శక్తి అందుతుంది.

4. శనగలు

పొట్టుతో కూడిన శనగలను కొద్దిగా పెనంపై వేయించి తరువాత తినవచ్చు. ఇవి కూడా స్నాక్స్‌ రూపంలో తినదగినవి. శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి.

5. తాజా పండ్లు

తాజా పండ్లను కూడా స్నాక్స్‌ రూపంలో తీసుకోవచ్చు. వీటి వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అనారోగ్య సమస్యలు ఉండవు.

6. కొబ్బరినీళ్లు

వీటిల్లో ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచుతాయి. శరీర కణాలకు ద్రవాలను అందిస్తాయి. కొబ్బరినీళ్లను తాగడం వల్ల శరీరానికి పోషణతోపాటు శక్తి కూడా లభిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts