Red Capsicum : ఎరుపు రంగు క్యాప్సిక‌మ్‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Red Capsicum : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం కూడా ఒక‌టి. క్యాప్సికంతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాప్సికంతో వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే క్యాప్సికంలో కూడా ఎరుపు, ప‌సుపు, ఆకుప‌చ్చ వంటి వివిధ ర‌కాలు ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా ఆకుప‌చ్చ‌గా ఉండే క్యాప్సికంను మాత్ర‌మే ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కేవ‌లం ఆకుప‌చ్చ క్యాప్సికమే కాకుండా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎరుపు రంగు క్యాప్సికంను చాలా మంది ఆహారంగా తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీనిలో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎరుపు రంగు క్యాప్సికంలో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల కంటికి సంబంధించిన స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అంతేకాకుండా ఎరుపు రంగు క్యాప్సికంను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో అలాగే మ‌నం తీసుకున్న ఆహారాన్ని సుల‌భంగా జీర్ణ‌మ‌య్యేలా చేయ‌డంలో కూడా ఎరుపు రంగు క్యాప్సికం మ‌న‌కు సహాయ‌ప‌డుతుంది. ఎరుపు రంగు క్యాప్సికంను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క వ‌క్తి పెరుగుతుంది. ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డే వారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అంతేకాకుండా ఎరుపు రంగు క్యాప్సికంలో లైకోపిన్, విట‌మిన్ సి, విట‌మిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.

Red Capsicum benefits in telugu know about them
Red Capsicum

ఒత్తిడిని త‌గ్గించి మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను అందించ‌డంలో కూడా ఎరుపు రంగు క్యాప్సికం మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఎరుపు రంగు క్యాప్సికం ఎక్కువ‌గా మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ ల‌లో అలాగే రైతు బ‌జార్ ల‌లో ల‌భిస్తుంది. ఆకుప‌చ్చ రంగు క్యాప్సికంతో పాటు ఎరుపు రంగు క్యాప్సికంను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts