Sweet Potato : మనకు రెగ్యులర్‌గా లభించే కూరగాయలతోపాటు సీజన్‌లో లభించే కూరగాయలు కూడా ఉంటాయి. వాటిల్లో చిలగడ దుంపలు కూడా ఒకటి. ఇవి తియ్యని రుచిని కలిగి ఉంటాయి. కానీ ఆలుగడ్డల మాదిరిగా ఈ దుంపలను తినగానే షుగర్ లెవల్స్ పెరగవు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఈ దుంపలను తినాలని నిపుణులు చెబుతుంటారు. వీటిల్లో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణ సమస్యలను లేకుండా చేస్తుంది. దీంతోపాటు షుగర్ లెవల్స్‌ను కూడా తగ్గిస్తుంది. అయితే చిలగడదుంపలు ఈ సీజన్‌లో అధికంగా లభిస్తాయి. కనుక వీటిని ఈ సమయంలో అధికంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో మన చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. దీంతో చర్మం పగులుతుంది. దీని వల్ల చర్మం తెల్లగా అవుతుంది. అలాగే మంట, దురద కూడా వస్తాయి. కానీ చిలగడదుంపలను తినడం వల్ల వీటిల్లో ఉండే ఫైబర్, విటమిన్ సి, ఎ వంటి పోషకాలు చర్మంలో తేమ పోకుండా ఉంచుతాయి. దీంతో చర్మం తేమగా ఉంటుంది. మృదువుగా మారుతుంది. చర్మం పగలదు. ఇలా చిలగడ దుంపలు మనకు ఈ సీజన్‌లో మేలు చేస్తాయి. అలాగే చలికాలంలో మన జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. మలబద్దకం కూడా వస్తుంది. కానీ ఈ దుంపలను తింటే వీటిల్లో ఉండే ఫైబర్ కారణంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. దీని వల్ల మలబద్దకం కూడా ఉండదు. కనుక చలికాలంలో చిలగడదుంపలను కచ్చితంగా తినాలి.
ఇక చిలగడదుంపల్లో బీటా కెరోటీన్, విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. కనుక మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఈ దుంపల్లో ఉండే కాపర్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. చలికాలంలో హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక చిలగడదుంపలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ దుంపలు మేలు చేస్తాయి. వీటిల్లోని ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
దుంప జాతికి చెందిన కూరగాయలు సహజంగానే శరీరంలో వేడిని పెంచుతాయి. కనుక చిలగడదుంపలను తినడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఇది మనకు ఈ సీజన్‌లో మేలు చేస్తుంది. చలికాలంలో మన శరీరం వెచ్చగా ఉంటుంది. దీంతో చలి నుంచి రక్షణ లభిస్తుంది. చిలగడదుంపలను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర సరిగ్గా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఈ దుంపలను తినడం వల్ల క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అండాశయ, వక్షోజాల క్యాన్సర్‌లు రావని నిపుణులు చెబుతున్నారు. ఈ దుంపలను తింటే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా నియంత్రణలోకి వస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక చిలగడ దుంపలను ఈ సీజన్‌లో తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.