టమాటాలను నిత్యం మనం ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం. చాలా మంది వీటిని రోజూ వంటకాల్లో వేస్తుంటారు. టమాటాలతో అనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. అయితే వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. టమాటాలను రోజూ తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. టమాటాలను జ్యూస్ రూపంలో లేదా సలాడ్ రూపంలో రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. టమాటాల్లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు ఎ, కె, బి1, బి3, బి5, బి6, బి7, సి, ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, క్రోమియం, కోలిన్, జింక్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది.
2. టమాటా చర్మం, వెంట్రుకలను సంరక్షిస్తుంది. టమాటాలను పేస్ట్‌లా చేసి మాస్క్‌లా వేసుకోవచ్చు. జుట్టుకు రాయవచ్చు. దీంతో వాటిల్లో ఉండే పోషకాలు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. అలాగే వెంట్రుకలకు సంరక్షణ లభిస్తుంది.
3. టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్ కణాలు పెరగవు. ప్రోస్టేట్, జీర్ణాశయ, పెద్దపేగు క్యాన్సర్లు రావు.
4. టమాటాల్లో విటమిన్ కె, సి, కాల్షియంలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
5. పొగ తాగడం మానేసిన వారిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ టమాటాలను తినడం వల్ల అవి రాకుండా ఉంటాయి. ఎందుకంటే టమాటాల్లో కోమారిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పొగ తాగడం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి రక్షిస్తాయి.
6. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, సిలు వీటిల్లో సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పన్నం అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
7. టమాటాల్లో విటమిన్ ఎ, బి, పొటాషియంలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
8. డయాబెటిస్ ఉన్నవారికి టమాటాలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిల్లో క్రోమియం అనే మినరల్ ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
9. జీర్ణ సమస్యలతో బాధపడేవారు రోజూ టమాటాలను తింటే ఫలితం ఉంటుంది. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి.
10. శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు టమాటాలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిల్లో ఉండే విటమిన్లు ఎ, సి, లైకోపీన్‌లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
11. అధిక బరువు తగ్గేందుకు టమాటాలు సహాయ పడతాయి. టమాటాల్లో కార్నైటైన్ అనబడే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది.
12. టమాటాలను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. రక్త హీనత సమస్య ఉన్నవారు రోజూ టమాటాలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
అయితే టమాటాలను తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు వీటిని తినేముందు డాక్టర్ సలహాను తీసుకోవాలి.