Off Beat

అండమాన్ జైలు చిరంజీవి వేట సినిమాలో చూపించినంత భయంకరంగా ఉంటుందా?

అవును, చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ శిక్షలు కూడా అలానే ఉంటాయి. అప్పట్లో అమలు చేసిన శిక్షలు మన స్వాతంత్ర సమరయోధులు పడిన కష్టాలకి ఇప్పటికీ అక్కడ ఉన్న జైలు గోడలు, ఒక రావి చెట్టు మౌన సాక్ష్యాక్షాలు. ముఖ్యంగా అక్కడ జైలు నిర్మించడానికి కారణం అది ఒక ద్వీపం. అప్పట్లో అక్కడికి వెళ్ళడానికి సముద్ర మార్గం ఒక్కటే. అక్కడ జైలు నిర్మాణం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం జైలులో ఉన్న ఖైదీలు ఒకరికి ఒకరు కనపడని విధంగా ఉంటుంది. ఇకపోతే అక్కడ శిక్షలు చాలా చాలా భయానకంగా ఉంటాయి. గోనె సంచితో తయారు చేసిన చొక్కా ప్యాంట్ ను వేసి ఎండలో నిలబెట్టి శిక్షించడం. సరైన పనిముట్లు ఇవ్వకుండా చేతులతో ఎండిన కొబ్బరికాయల పీచు వలవడం.

కొబ్బరి పీచుతో తాడు తయారుచేయటం. మిగిలిన కొబ్బరి నుంచి గానుగ ద్వారా ఒక ఎద్దు లేదా ఆవు ఒక రోజులో తియ్యగలిగే నూనె కంటే 3 రెట్లు తీయించ‌డం. ఎదిరిస్తే కొట్టడం. మరీ తిరగబడితే గోనె సంచి చొక్కా వేసి ఇనుప కడ్డీలతో కట్టేసి ఎండలో నిలబెట్టడం. పారిపోవాలని ప్రయత్నించి పట్టుబడిన వారిని ముగ్గుర్ని కలిపి ఒకేసారి ఉరి తీయ‌డం. ఇలాంటి శిక్ష‌లు ఉంటాయి. ఖైదీలు తప్పించుకునే అవకాశం లేకుండా తలుపులను ఇనుముతో గట్టిగా తయారు చేశారు. ఖైదీలను ఇనుపతాళ్లతో కట్టివేసే వాళ్లు ఇక్కడ. ఈ జైల్లో ఉన్న కిటీకీల గురించి వివరంగాచెప్పాలి. ఖైదీలను ఉంచే ప్రతి గదికి ఒకచిన్న కిటికీ ఉంటుంది . అయితే అవి అందరికీ తెలిసిన కిటికీల లాంటివి కాదు. చాలా ప్రత్యేకంగా కట్టినవి. ఎలా అంటే…గదిలో పలున్న ఖైదీలు కిటికీ నుంచి బయటకుచూస్తే వాళ్లకు కేవలం కిటికీకి ఎదురుగాఉన్న కొద్ది ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది . బయట ఏం జరుగుతుందో తెలియదు.

do you know how andaman jail is

కానీ బయటి నుంచి కిటికీ గుండా లోపలికి చూస్తేమాత్రం.. గదిలోని ప్రతిభాగం పూర్తిగా కనిపిస్తుంది . ఖైదీలు లోపల ఏం చేస్తున్నారు ? ఎలా ఉన్నారు ?.. అన్నీ చూడొచు, ఇప్పటికీ ఈ కిటికీల నిర్మాణం అంతుచిక్కని రహస్యమే. జైలుకి వేయబడే తాళం ఎంత పెద్దది అంటే కనీసం 10*10 అంగుళాల సైజులో ఉంటుంది. చివరిగా అన్ని పోరాటాల తర్వాత, 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్ లోని జింఖానా గ్రౌండ్ లో నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగం అండామాన్ దీవులే అని ఆ రోజు నేతాజీ ప్రకటించారు.

Admin

Recent Posts