మనిషి చనిపోయాక అతని శరీరానికి ఏం జరుగుతుంది..? ఏం జరుగుతుంది… అతని వర్గ ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం అతని కుటుంబ సభ్యులో, బంధువులో అంత్య క్రియలు చేస్తారు. అస్సలు ఎవరూ లేకుంటే అనాథ శవంలా వారి మృతదేహాలను దహనం చేస్తారు. అయితే మేం చెబుతోంది దహనం గురించి కాదు. మనిషి చనిపోయాక, అంత్యక్రియలు చేసే చివరి క్షణం వరకు అతని దేహానికి ఏం జరుగుతుందనే దాని గురించే మేం మాట్లాడేది. సాధారణంగా అయితే చనిపోయిన మనిషి దేహంలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. రక్త సరఫరా ఆగిపోయి అవయవాలు అన్నీ పనిచేయడం మానేస్తాయి. శరీరమంతా రాయి అంత దృఢంగా గట్టిగా మారిపోతుంది. అయితే చనిపోయిన మనిషి దేహం నుంచి అరుపులు వస్తాయట… గుర్… గుర్… అనే శబ్దాలు వినిపిస్తాయట. అవును, మేం చెబుతోంది నిజమే… కావాలంటే ఇది చదవండి…
మనిషి చనిపోయాక అతని మృతదేహంలో గుండె ఆగిపోయి రక్త సరఫరా నిలిచిపోతుంది. అవయవాలు పనిచేయవు. ఈ క్రమంలో శరీరమంతా నీలి రంగులోకి మారిపోతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు ఇంకా తగ్గగానే శరీరం పసుపు రంగలోకి మారుతుంది. చనిపోయిన మనిషి మృతదేహంలో ఓ రకమైన గ్యాస్ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. దీని వల్ల కళ్లు, నాలుక బయటికి పొడుచుకు వస్తాయి. అంతేకాదు అవయవాలు కుళ్లడం మొదలవుతుంది. చనిపోయిన వారి దేహాల నుంచి అరుపులు వస్తాయని చెప్పాం కదా. అవును, వస్తాయి. అయితే అది పోస్ట్‌మార్టం చేసే సమయంలో. ఆ సమయంలో శరీరంలో ఉండే గ్యాస్ స్వరపేటికపై ఒత్తిడి కలగజేస్తుంది. అందువల్లే వివిధ రకాల శబ్దాలు బయటికి వినిపిస్తాయి. అంతేకానీ, ఏ దెయ్యం వల్లో, భూతం వల్లో అనుకునేరు.
మనిషి చనిపోయిన వెంటనే అతని మృతదేహంలో బాక్టీరియాలు, సూక్ష్మ జీవులు మిక్కిలిగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అలాంటి దేహాల వద్దకు చీమలు, సాలె పురుగులు కూడా ఎక్కువగానే వస్తాయి. చనిపోయిన మనిషి శరీరానికి కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు పూసి అలాగే ఉంచితే అందులోకి బాక్టీరియాలు, సూక్ష్మ క్రిములు ప్రవేశించవు. అయితే పురాతన కాలంలో మమ్మీలను ఈవిధంగానే ఉంచేవారు. అందుకే ఎన్ని వందల సంవత్సరాలైనా మమ్మీలు అలాగే ఉంటాయి. మనిషి చనిపోయాక అతని మృతదేహం లెదర్ అంత స్ట్రాంగ్‌గా మారుతుంది. దీనికి కారణమేమిటంటే ఆ దేహంపై సరైన దుస్తులు కప్పకపోవడమే. అలా కప్పి ఉంచితే శరీరం అంత స్ట్రాంగ్‌గా మారదు. చనిపోయిన వారి శరీరాల్లో ఉత్పన్నమయ్యే గ్యాస్ కారణంగా ఆ దేహాల నుంచి చర్మం కూడా ఊడిపోతూ ఉంటుంది. శరీరం లోపల అన్నింటికి అతుక్కుని ఉండే చర్మం మొత్తం క్రమంగా ఊడిపోతూ వస్తుంది.