Off Beat

హాల్ లో సోఫా లో వదిన పక్కన మరిది కూర్చోవచ్చా.. కూడదా?

ఒక చిన్న పిట్టకథ: అనగనగా ఒక గురువు, శిష్యుడు కలిసి నడుస్తున్నారు, వారు ఒక నదిని దాటి అవతలి ఒడ్డు కి వెళ్ళాల్సి ఉంది.. ఈలోపల ఒక యువతి వచ్చి నదిని దాటేందుకు సహాయపడాల్సిందిగా వారిని కోరుతుంది.. సన్యాసులు కనుక గురు శిష్యులిద్దరూ పరస్త్రీ ని తాకరాదు.. ఈ విషయమై శిష్యుడు శషభిషలు పడుతుండగా, గురువు ఒక్క ఉదుటున ఆమెను భుజాన ఎత్తుకుని అవతలి ఒడ్డు కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేస్తాడు..

గురువు గారు పరస్త్రీ ని తాకినా విషయం శిష్యుడి మనసులో శంక లాగా ఉండిపోతుంది, గురువు మాత్రం తన దినచర్యలో మునిగిపోతాడు.. శిష్యుడు ఏ పని మీద దృష్టి నిలపలేకపోతాడు, చివరికి తట్టుకోలేక గురువు ని ఈ విషయమై ప్రశ్నిస్తాడు.. అప్పుడు గురువు ఈ విధంగా సమాధానం చెప్తాడు పిచ్చి వాడా, నేను ఆ యువతిని ఎప్పుడో వదిలేసాను, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావా(మనసులో) అని..

have you understood this good story

కథలో శిష్యుడి పాత్ర మనలో చాలా మందిని పోలి ఉంటుంది అని అనుకోకుండా ఉండలేము.. Over Thinking, ప్రతి విషయాన్నీ శల్య పరీక్ష చేయడం, మనశ్శాంతి ని పాడు చేసుకోవడం , ఈరోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.. ఎవరో ఏదో అనుకుంటారేమో, ఏదో జరిగిపోతుందేమో, కలియుగం ఈరాత్రికే అంతమైపోతుందేమో అన్నస్థాయిలో ఆలోచనలు ఉంటున్నాయి..

ఇప్పుడు మీ ప్రశ్న దగ్గరకి వద్దాము, వదిన ప్రక్కన కూర్చుంటే తప్పవుతుందా అని , సరే ప్రక్కనే కూర్చుకుండా , సమాజం కోసం నటిస్తూ, తప్పుడు పనులు చేయొచ్చా అని ఇక్కడ మరొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా.. సంకుచిత మనస్తత్వం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు, సమాజానికి మేమె ప్రతినిధులం అంటూ అతి చేసే వాళ్ళకి దూరంగా ఉండండి.. ఆ కథలో శిష్యుడి లా ప్రతికూల ఆలోచనలు అనే బరువు ని మోయకండి.. మంచి-చెడు అనేవి ఒక మనిషి యొక్క దృష్టి కోణాలు మాత్రమే. అని గుర్తిస్తే చాలు..

Admin

Recent Posts