వినోదం

మీకు పరమ విసుగు తెప్పించిన సినిమా ఏమిటి?

మేఘసందేశం.. అక్కినేని నాగేశ్వరరావు నటించి, దాసరి దర్శకత్వం, వహించిన సినిమా. విసుగేం ఖర్మ, వెగటు కూడా తెప్పించిందీ. ఊరందరికీ పెద్దయిన (ANR), భార్య(జయసుధా) పిల్లలు ఉన్న ఓ పెద్దమనిషి, ఊళ్లో వాళ్ళందరికీ పెద్దల ఇంట్లో వాళ్లకి ఓ దేవుడా చక్కగా సంసారం చేసుకుంటూ ఉండే ఓ మహానుభావుడు, అయితే తమ ఊరి బయట కొత్తగా వచ్చి తిష్ట వేసిన ఓ నాట్యకారిణి (జయప్రద)ని చూస్తూ, ఊళ్లో మగ వారందరూ తమ తమ పనులు వదిలివేసి పని చేయకుండా కాలం గడుపుతున్నరని తెలుసుకొని, వారిని గద్దిస్తానంటూ, ఆ నాట్యగత్తెను ఊరు నుండి పంపిస్తానంటూ ఆమె వద్దకు వెళ్లిన పెద్దమనిషి, తానే ఆమే వ్యామోహంలో పడిపోతాడు.

సంసారం, భార్య, పిల్లల్ని, ఊరును వదిలేసి ఎటువంటి బాధ్యతలు లేకుండా ఆనాట్య శిఖామణితోనే ఉండిపోతాడు, దానికి ఆయన క‌ళాకారిణి అని దిక్కుమాలిన కారణం చెప్పి, భార్య పిల్లల కోసం ఇంటికి రమ్మని అడిగిన వారందరిని దబాయిస్తుంటాడు, దీనికి కళా, సంగీతం, నాట్యం అని ఒక పేరు, ఆ పేరుతో అక్రమ సంబంధానికి ఒక కళా/ఆర్ట్ అనే షుగర్ కోటింగ్, ఇది స్థూలంగా కథ.

have you seen this worst movie

ఇది అక్కినేని నాగేశ్వరావు ఎలా ఒప్పుకున్నారో, దాసరి ఎందుకు తీశారో, ఆ భగవంతుడికే తెలియాలి, సినిమా చూస్తుంటే మాత్రం రోతగా అనిపిస్తుందీ, భరింపరాని కోపం వస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జగ్గయ్య, దాసరి ఇటువంటి చౌకబారు, నాసిరకం సినిమా తీశారంటే నమ్మశక్యంగా లేదు.

Admin

Recent Posts