Off Beat

Nita Ambani : స్కూల్ టీచ‌ర్‌గా పని చేసిన‌ప్పుడు నీతా అంబాని తొలి జీతం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Nita Ambani : నీతా అంబానీ.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య మాత్రమే కాదు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ వర్క్ వంటి అనేక రంగాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌గా ఆమె తన స్టైల్‌, ఫ్యాషన్‌తో అభిమానులను కట్టిపడేస్తుంది. యాభై ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జిటిక్‌గా నడుస్తున్న నీతా డ్యాన్స్‌కి, ఫిట్‌నెస్‌కి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. నీతా ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయట.

రోజూ ఉదయాన్నే వాకింగ్, బ్రేక్‌ఫాస్ట్‌లో నట్స్, పండ్లు, తాజాగా కూరగాయలు తప్పక తీసుకుంటారట. నీతా అంబానీ తన డైట్‌లో తప్పనిసరిగా ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్‌ తీసుకుంటారు. ఆమె పుష్కలంగా నీరు తాగుతారు. తన ఆహారంలో ఆకు కూరలు, పండ్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు. రాత్రిపూట క్రమం తప్పకుండా వెజిటబుల్‌ సూప్ తీసుకుంటారు. నీతా ప్రతిరోజూ వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేస్తారు. ఇదండీ.. నీతా అంబానీ బ్యూటీ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌. అయితే నీతా అంబాని గురించి కొన్ని విష‌యాలు ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చాయి.

nita ambani salary when she worked as a school teacher

1985లో ముఖేష్ అంబానీతో వివాహమైన ఒక సంవత్సరం తర్వాత, ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. పాఠశాల ఉపాధ్యాయురాలిగా తాను నెలకు 800 రూపాయల జీతం అందుకున్న‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. కొంతమంది తనను ఎగతాళి చేసినా, ఆమె తన పనిలో సంతృప్తిని పొందింది. అయితే తాను జాబ్ చేసిన పొందిన ఆదాయం అంతా డిన్న‌ర్‌కి ఖ‌ర్చు చేసిన‌ట్టు పేర్కొంది. ఆమె 2003లో ముంబయిలో ‘ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్’ని స్థాపించారు, దానికి తన దివంగత మామగారి పేరు పెట్టారు. ఆమె నిబద్ధతకు ఈ పాఠశాల ఎంతో నిదర్శనంగా నిలుస్తుంది.

Admin