Indra Movie Mistake : మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలలో ఇంద్ర మూవీ ఒకటి. ఈ సినిమా విడుదలై 20 యేళ్లకి పైగానే అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ముచ్చట వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులకు హద్దే లేదు. బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయాడు మెగాస్టార్. తన కెరీర్‌లో తొలిసారి నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది..అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లాంటి సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలోనే వచ్చిన చిత్రాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. అదే కోవలోకి వచ్చే సినిమా ఇంద్ర. అప్పటి వరకు రాయలసీమ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా చేయని చిరంజీవి.. తన కోసం ప్రత్యేకంగా ముచ్చటపడి మరీ ఇంద్ర కథను సిద్ధం చేయించుకున్నాడు.
ఇంద్ర సినిమా వంద రోజులు థియేటర్లలో ఆడటంతో పాటూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ కెరీర్ కూడా ఇంద్రకు ముందు ఆ తరవాత అన్నట్టుగా మారిపోయింది. ఇక ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించగా అశ్వినిదత్ సినిమాను నిర్మించారు. అంతే కాకుండా మణిశర్మ సినిమాకు స్వరాలను సమకూర్చారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు గుణశేకర్ దర్శకత్వం వహించగా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కంటే ముందు చిరు హీరోగా డాడీ సినిమా వచ్చింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాకు చిరంజీవి ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. కాశీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ రాసిన మాటలు కూడా ప్లస్ గా నిలిచాయి. ఈ సినిమాలో దర్శకుడు పప్పులో కాలు వేశాడు. ఓ సన్నివేశం చిత్రీకరణలో హోలీ పండుగ జరుగుతుంది. అయితే అదేరోజు సినిమాలో చిరంజీవి సిస్టర్స్ వచ్చి రాఖీ కడతారు. అలా రెండు పండుగలను ఒకే రోజు చూపించి దర్శకుడు మిస్టేక్ చేశాడు. అయితే ఇప్పుడు గుర్తు పట్టిన నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సాధారణంగా రాఖీ, హోలీ ఒకే రోజు రావు. కానీ ఈ సినిమా కోసం డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి దీన్ని పొరపాటు అనడం కంటే సినిమాటిక్ లిబర్టీ అనడమే కరెక్ట్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో జరిగిన ఈ పొరపాటును గుర్తించిన ఇంద్ర సినిమా మేకర్స్, సినిమా విడుదలైన కొద్ది రోజులకే “ఇంద్ర సినిమాలో ఒక పొరపాటు ఉంది. అదేంటో కనిపెట్టండి” అని కాంటెస్ట్ కూడా పెట్టారు.