Off Beat

బ‌య‌ట‌కు చూసేందుకు అంత‌గా బాగోని రెస్టారెంట్లు, ఫుడ్ బాగున్న‌వి ఎక్క‌డైనా ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బయటినుండి చూడటానికి బాగుండని రెస్టారెంటుకు వెళ్ళి రుచికరమైన ఆహారం తిన్న సందర్భం మీకు ఎదురైందా&quest; అయ్యుంటే ఎక్కడ&quest; ఏమి తిన్నారు&quest; బావుండని అన్న‌ప్పుడు మీ ఉద్దేశం ఆడంబరపూర్వక&comma; ఆధునిక రూపురేఖలు లేకుండా ఉన్నది అని అనుకుంటున్నా&period; చాలా ఊళ్ళల్లో ఎన్నో సార్లు బయటకు రూపురేఖలు గొప్పగా లేని రెస్టారెంట్స్ లో ఎంతో రుచికరమైన ఆహారం తిన్నాను&period; ఎందుకో ఈ రెండు ఇక్కడ చెప్పాల్సినవి అనిపించాయి&period; ఆనంద భవన్&comma; గుంటూరు&period;&period; ఈ ఫలహారశాలకు అటు-ఇటుగా మన గణతంత్ర భారత దేశానికి ఉన్నంత దీర్ఘ చరిత్ర ఉంది&period; చూడగానే ఆకర్షణీయమైన రెస్టారెంట్ లాగా కనిపియకపోవచ్చు&period; కానీ అది పాత కట్టడం అవ్వటంతో నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం&period; ఈ హోటల్ లో ఒకప్పుడు రెండు పూటలా శాఖాహార భోజనం&comma; టిఫిన్లు&comma; కాఫీ-టీలు ఉండేవి&period; ఇప్పుడు కేవలం మధ్యాహ్న భోజనం మాత్రమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నప్పుడు రుచులు తెలియని రోజులలో గుంటూరు వెళ్ళినప్పుడల్లా అక్కడే టిఫిన్లు&comma; భోజనాలు&period; టిఫిన్స్ ఇష్టపడి తినే వాడిని కానీ&comma; భోజనం తినాలి అని తినే వాడిని&period; తర్వాత చాలా సంవత్సరాలు అక్కడ తినటం వీలుపడలేదు&period; నాకు రుచులు&comma; వాటి సూక్ష్మ వివరణలు తెలిసాక అనుకోకుండా అక్కడికి నా స్నేహితుడితో వెళ్ళాను&period; బయట చూసి కొంచెం ఆలోచించా వెళ్దామా ఒద్దా అని&period; అయితే ఒక విషయం మాత్రం నిక్కచ్చిగా తెలుసు &&num;8211&semi; ఎంతో శుభ్రంగా వొండుతారని&period; ఆ నమ్మకంతో బాహ్య రూపాన్ని పట్టించుకోక లోపలికి వెళ్ళాము&period; ఇంత మంచి శాఖాహార భోజనం నేను ఇప్పటివరకు తినలేదు&comma; తింటానని అనుకోవట్లేదు&period; రుచులు తెలిసిన ఎవరికైనా వంటకాలలో నాణ్యత ఇట్టే తెలిసిపోతుంది&period; ఈ కాలం యువతకి మంచి భోజనం అంటే 20 రకాల వంటకాలతో వేడి అన్నం&comma; కావాల్సినంత నెయ్యి&period; ఈ హోటల్ లో అన్ని రకాలు ఉండవు&period; అరటి ఆకులో సాదా భోజనం&period; మా పెదనాన్న ఎప్పుడో ఎవరితోనో అంటుంటే విన్నాను&period; వేపుడు కూర కూడా పెట్టకుండా అంత వసూలు చేయగలిగింది ఇయన ఒక్కడే అయ్యా&excl; వేపుడు కూడా ఉండదు అంటే ఊహించుకోండి ఎంత సాధారణ భోజనమో&period; క్రికెట్ నేపధ్యంలో టెక్స్ట్-బుక్ షాట్ అంటారు చూడండి &&num;8211&semi; ఇక్కడి వంటకాలు కూడా అంతే&comma; ఇలాగే ఉండాలి అనిపించేలా ఉంటాయి&period; వెల్లుల్లి&comma; మసాలలే కావాలి అనుకునే వారికి ఇది సరైన భోజనశాల కాదు&period; నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒకతను తన పక్కన ఉన్న స్నేహితుడితో ఇలా అన్నారు&colon; ఏదైనా బాగుంది అని తెలియాలి అన్నా ఒక క్లాస్ ఉండాలి à°°à°¾&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89923 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;anand-bhavan&period;jpg" alt&equals;"what are some good hotels you have seen even their out side is bad " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పలరాజు మిలిటరీ హోటల్&comma; ఏలూరు&colon; చాలా సంవత్సరాల క్రితం స్నేహితులతో కలిసి విజయవాడ నుంచి ఏలూరు కేవలం దీని పని చూడటానికే వెళ్ళా&period; అప్పటికే ఈ హోటల్ గురించి ఎంతో గొప్పగా విన్నాను&period; తీరా అక్కడికి వెళ్ళాక బయట అంత బురదగా&comma; అశుభ్రంగా ఉంది&period; నేను రాను అని మొత్తుకున్నా&comma; అయినా కూడా గోల చేసి తీసుకెళ్లారు&period; అయిష్టంగా&comma; తప్పక నన్ను నేను ఇదుచుకుంటు లోపలికి వెళ్ళాను&period; భోజనానికీ కూర్చోగానే ఎందుకో మంచి అనుభూతి కలిగింది&period; ఇది మాంసాహార భోజనశాల&period; ఎన్నో రకాల మాంసం వంటకాలు దొరుకుతాయి &&num;8211&semi; నాటు కోడి&comma; చికెన్&comma; మటన్&comma; రొయ్యలు&comma; పీతలు&comma; చేప&comma; కంజు పిట్ట మొదలైనవి &&num;8211&semi; వీటితో రకరకాల వంటకాలు&period; భోజనం బాగుంటుంది&period; ఇక్కడ తినకపోతే జీవితంలో ఒకటి కోల్పోతారు లాంటి వాక్యాలు దీనికి వాడను కానీ పీక‌à°² వర‌కు తినటం అంటే ఎంటో మొదటిసారి అక్కడే అనుభవించా&period; తర్వాత అక్కడే మరెన్నో సార్లు అనుభవించా అనుకోండి&excl; పని లేకుంటే తప్పకుండా ఇదే పనిగా పెట్టుకొని వెళ్ళదగ్గ రెస్టారెంటే&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts