Off Beat

చాలా బస్సుల‌లో ఎయిర్ సస్పెన్షన్ అని రాసి ఉంటుంది దాని అర్థం తెలియజేయగలరా?

అది బస్, లారీ, కారు, బైకు ఏది అయినా గుంత‌లో బండి గుంత‌లలో పోనిచ్చినపుడు మనకు నడుం నొప్పి రాకూడదు అంటే బండికి సస్పెన్షన్ ఉండాలి. బైకు అయితే ముందర, వెనక షాక్‌ అబ్జార్బర్స్ అంటే స్ప్రింగులు ఉంటాయి. గుంత‌లో పడినపుడు అవి కంప్రెస్ అయ్యి గుంత‌ బయటకు రాగానే మామూలు స్థితికి వస్తాయి. చాలా సైకిళ్లకు ఇవి ఉండవు కాబట్టి గుంటలలో పోనిచ్చినపుడు సైకిలుకు, బైకుకు తేడా మనం సులభంగా గమనించవచ్చు.

అలాగే కార్లకు, బస్సులకు 20వ శతాబ్దము చివరి దాకా సస్పెన్షనుకు స్ప్రింగు కాయిల్స్ వాడేవారు. కమాను కట్టలు కూడా ఇందులో ముఖ్య భాగము.

what is air suspension in vehicles

అయితే సైన్సు అభివృద్ధిలో భాగముగా ఈ మెకానికల్ స్ప్రింగులకు బదులు ఎయిర్ కంప్రెషను ద్వారా సస్పెన్షనును కంట్రోలు చేయడము కనుగొన్నారు – దీని కోసం గాలిని ఒక రబ్బరులోకి పంపిస్తారు – వీటిని ఎయిర్ స్ప్రింగులు అంటారు. వీటిని మొదట వోల్వో బస్సులలో, తరువాత ప్రైవేటు ట్రావెల్సు వారు మామూలు లేలాండ్, టాటా బస్సులలోను పెట్టించుకున్నారు. వాహ‌నాలు గుంత‌ల మీదుగా ప్ర‌యాణించిన‌ప్పుడు యాంత్రికంగా కాకుంగా గాలి ద్వారా స్ప్రింగ్ యాక్ష‌న్‌ను ఇస్తాయి. దీంతో వాహ‌నంలో ప్ర‌యాణించే వారికి కుదుపులు ఉండ‌వు.

Admin

Recent Posts