lifestyle

సాధారణంగా ప్రతి మనిషికి వచ్చే 10 కలల, వచ్చే కలను బట్టి ఆ వ్యక్తి ఏవిధంగా ఆలోచిస్తున్నాడో తెలుసుకోవొచ్చు.!?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రపోతే చాలు మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంటుంది&period; అయితే కలలను గురించి అధ్యయనం చేసే నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రతి మనిషి రాత్రి పూట నిద్రించే సమయంలో దాదాపు 4 నుంచి 5 వరకు భిన్నమైన కలలను కంటాడట&period; ఒక్కో కల 15 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందట&period; అయితే వీటిలో అధిక శాతం వరకు అనేక మందికి గుర్తుండవు&period; కేవలం కొద్ది మందికి మాత్రమే అవి గుర్తుంటాయి&period; కానీ కొన్ని రకాల కలలు మాత్రం మనలో అధిక శాతం మందికి సాధారణంగా తరచూ వస్తూనే ఉంటాయి&period; నిపుణలు చెబుతున్న ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారికి కలలు వస్తాయట&period; వారి వ్యక్తిత్వం&comma; నడవడిక ఇత్యాది అంశాల మేళవింపుతో కూడినవై కలలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇదే సమయంలో కలలు కొన్ని విషయాలను కూడా మనకు చెబుతుంటాయి&period; మనం భయపడుతున్న&comma; నిర్లక్ష్యంగా వదిలేస్తున్న విషయాలను ప్రతిబింబించే విధంగా కలలు వస్తాయి&period; అసలు మనకు సాధారణంగా తరచూ వచ్చే కలలు ఏమిటి&quest; వాటి గురించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఏదైనా ఎత్తయిన భవంతి నుంచి లేదా లోయ వంటి ప్రదేశంలోకి పడి పోతున్నట్టుగా కల వస్తే మీరు జీవితంలో ఏదో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్టు భావించాలి&period; ఈ సమస్య పని&comma; సంబంధ బాంధవ్యాలు&comma; లేదా ఇతర వేరే ఏ విషయానికి సంబంధించిందైనా అయి ఉండవచ్చు&period; స్కూల్&comma; కాలేజ్ లేదా ఆఫీస్ వంటి ప్రదేశాల్లో అందరికీ మీరు నగ్నంగా కనిపిస్తున్నట్టు కల వస్తే అది మీకు ఉన్న తొందర&comma; ఆతృతను తెలియజేస్తుంది&period; సాధారణంగా కొత్త ప్రదేశంలోకి వెళ్లబోతున్న వారికి&comma; ప్రమోషన్ వచ్చిన ఉద్యోగులకు&comma; కొత్త ఉద్యోగులకు ఇలాంటి కలలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80750 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;dream-2&period;jpg" alt&equals;"these 10 type of dreams we will get regularly " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా పరీక్ష రాస్తున్నట్టు కల వస్తే అది మీరు ఒత్తిడికి గురవుతున్నారని సూచిస్తుంది&period; సాధారణంగా స్కూల్‌లో చదివే విద్యార్థులకు&comma; ఆఫీస్‌లలో ఎక్కువగా పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి కలలు వస్తాయి&period; ఇవి మీరు ఒత్తిడికి లోనవుతుండడాన్ని సూచిస్తాయి&period; ఎవరైనా సెలబ్రిటీని కలిసినట్టు కల వస్తే మీలో ఉన్న నైపుణ్యాలు బహిర్గతమవుతున్నట్టు భావించాలి&period; మంచి పేరు&comma; గుర్తింపు కోసం మీరు ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి&period; ఈ కల అసలు రాకూడదంటారు&period; అదేనండీ చనిపోతున్నట్టు వచ్చే కల&period; ఇలా వస్తే మీరు మీ జీవితంలో ఏదైనా సంబంధం&comma; ఉద్యోగం లేదా వేరే ఏదైనా విషయానికి శాశ్వతంగా ముగింపు పలకాలని భావిస్తున్నట్టు అర్థం&period; కొత్త జీవితం కోసం ఆరాటపడుతున్న వారికి కూడా ఇలాంటి కలలు వస్తాయి&period; అయితే కొన్ని వర్గాల్లో మాత్రం చనిపోతున్నట్టు కల వస్తే మంచిదేనని&comma; అది ఆ వ్యక్తికి దీర్ఘాయువునిస్తుందని నమ్ముతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్టు కల వస్తే మీరు ఎదుర్కొంటున్న ఏదో ఓ సమస్యను కొంత సేపు పక్కన పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది&period; అయితే ఇలాంటి కలలు సాధారణంగా పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా వస్తాయట&period; మీ జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నట్టు కల వస్తే అది మీ భాగస్వామి మీ పట్ల చూపుతున్న శ్రద్ధ&comma; ఆసక్తిని తెలియజేస్తుంది&period; ఇదేకాకుండా మీ భాగస్వామిపై మీరు నమ్మకం కోల్పోతే కూడా ఇలాంటి కలలు వస్తాయి&period; ఎక్కడికైనా ఆలస్యంగా వెళ్లినట్టు కల వస్తే తరువాత రోజు ఆ వ్యక్తి నిర్దిష్ట సమయానికల్లా ఏదైనా ముఖ్యమైన ప్రదేశానికి తప్పనిసరిగా వెళ్లాలని అర్థం&period; అయితే ఎల్లప్పుడూ ఆలస్యంగా వెళ్లే వారికి ఈ కలలు ఎక్కువగా వస్తాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80749" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;dream-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దంతాలు ఊడిపోయినట్టుగా కల వస్తే కొందరు దీన్ని అపశకునంగా&comma; మరికొందరు శుభంగా భావిస్తారు&period; ఈ కల వచ్చిన వ్యక్తుల్లో కొందరు తమకు పట్టుదల&comma; శక్తి&comma; ఆత్మవిశ్వాసం పెరిగాయని భావిస్తారు&period; మరికొందరు తమ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని అనుకుంటారు&period; మహిళలల్లో ఇలాంటి కలలు వస్తే వారు తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి&period; అదే పురుషుల్లో అయితే లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం ఆసక్తి చూపుతున్నారని అర్థం చేసుకోవాలి&period; పాములు కనపడినట్టు కల వస్తే ఆ వ్యక్తి తనను తాను మార్చుకుంటానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకోవాలి&period; ఎందుకంటే పాములు కొద్ది రోజులకు ఒకసారి తమ చర్మాన్ని కుబుసం రూపంలో విడుస్తాయిగా&period; అలాగే వ్యక్తులు కూడా తమను తాము కొత్త వ్యక్తిత్వానికి మార్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది&period; దీన్ని అనేక మంది శుభంగానే భావిస్తారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts