Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

Amrutha Kada : ఉష్ణ మండ‌ల‌, ఉప ఉష్ణ మండ‌ల ప్రాంతాల‌లో ఎక్కువ‌గా పెరిగే మొక్క‌ల‌లో అమృత కాడ మొక్క కూడా ఒక‌టి. దీనిని నీరి క‌సువు, వెన్న తీపి కూర‌, వెన్న వెదురు, అడ‌వి నాభి, యాండ్ర ఆకు అని కూడా అంటుంటారు. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బ‌డుతూనే ఉంటుంది. 1980 వ సంవ‌త్స‌రంలో అమృత‌కాడ మొక్క‌ను ప్ర‌త్యేకంగా కాలిఫోర్నియాకు ప‌రిచ‌యం చేశారు. ఈ మొక్క‌లు ఎక్కువ‌గా గ్రామాల‌లో, ప‌చ్చిక‌ బ‌య‌ళ్లలో, బీడు భూముల్లో, అడ‌వి ప్రాంతాల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఈ మొక్కను చాలా మంది చూసే ఉంటారు కూడా. ఈ మొక్క‌ను క‌లుపుగా భావించి చాలా మంది వీటిని పీకేస్తూ ఉంటారు. కానీ అమృత కాడ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క‌ను ప‌శువులు చాలా ఇష్టంగా తింటాయి. ఈ మొక్క యాంటీ వైర‌ల్, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలను కూడా క‌లిగి ఉంటుంద‌ని కొన్ని ప‌రిశోధ‌నలు తెలియ‌జేస్తున్నాయి.

గాయాల‌ను, పుండ్ల‌ను, చ‌ర్మ వ్యాధులను, ముఖంపై మొటిమ‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి చ‌ర్మం పై స‌మ‌స్య ఉన్న చోట పై పూత‌గా రాయ‌డం వ‌ల్ల చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్యలు త‌గ్గుతాయి. అమృత కాడ మొక్క ఆకులు జ్వ‌రానికి మంచి ఔష‌ధంగా ప‌ని చేస్తాయి. ఈ మొక్క ఆకుల‌ను ఆరింటిని తీసుకుని వాటిని 150 ఎంఎల్ నీటిలో వేయాలి. ఇందులోనే అర టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను, మిరియాల‌ను వేసి మ‌రిగించి వ‌డ‌క‌ట్టుకోవాలి. ఈ నీటిని రోజుకు ఒక‌సారి తాగ‌డం వ‌ల్ల జ్వ‌రం త‌గ్గుతుంది.

Amrutha Kada plant is very beneficial to us know the benefits
Amrutha Kada

అమృత కాడ ఆకుల‌ను కూర‌గా చేసుకుని కూడా తింటూ ఉంటారు. ఇలా కూర‌గా చేసుకుని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు కలుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల‌లో ఈ మొక్క ఆకుల‌ను పాము కాటుకు విరుగుడుగా కూడా ఉప‌యోగిస్తారు. ఈ మొక్క ఆకుల‌ను, కాండాన్ని దంచి వాటితో క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం వ‌ల్ల స్త్రీల‌లో వ‌చ్చే నెల‌స‌రి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని చెబుతున్నారు. ఈ ఆకుల‌ను చ‌ల్ల‌ని నీటిలో వేసి న‌లిపి ఆ నీటిని వ‌డ‌క‌ట్టుకుని తాగ‌డం వ‌ల్ల మ‌లేరియా జ్వ‌రం త‌గ్గుతుంది. ఈ మొక్క మొత్తాన్ని పేస్ట్ లా చేసి మొల‌ల‌పై, ఛాతిపై, నొప్పుల‌పై రాసుకోవ‌డం వ‌ల్ల ఔష‌ధంగా ప‌ని చేసి ఆయా స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుందని వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అమృత‌కాడ మొక్క గొంతునొప్పిని త‌గ్గించ‌డంలో, కుష్టు వ్యాధిని న‌యం చేయ‌డంలో అలాగే నాడీ వ్య‌వ‌స్థ రుగ్మ‌త‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది. అంతే కాకుండా డ‌యేరియా, త‌ల‌నొప్పి, అతిసారం, దంతాల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts