Curry Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 4 క‌రివేపాకు ఆకుల‌ను న‌మిలి తినండి.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..

Curry Leaves : క‌రివేపాకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. కూర‌ల్లో క‌రివేపాకు విరివిరిగా వాడుతూ ఉంటాం. క‌రివేపాకు చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. వంట‌ల్లో క‌రివేపాకును వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంది. అయితే చాలా మంది కూర‌ల్ల‌లో క‌రివేపాకును ఏరి ప‌క్క‌కు పెడుతుంటారు. క‌రివేపాకులో ఉండే ఔష‌ధ గుణాల గురించి తెలిస్తే మాత్రం క‌రివేపాకును ఎప్ప‌టికి ప‌క్క‌కు పెట్టరు. క‌రివేపాకు తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అస‌లు క‌రివేపాకులో ఉండే ఔష‌ధ గుణాలు ఏమిటి.. అవి మ‌న ఆరోగ్యానికి ఏవిధంగా స‌హాయ‌ప‌డ‌తాయి అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌రివేపాకులో కోయినిజెన్ అనే గ్లూకోజైడ్ ఉంటుంది. దీని వ‌ల్ల‌నే క‌రివేపాకు ప్ర‌త్యేక‌మైన రుచిని, వాస‌న‌ను క‌లిగి ఉంటుంది.

క‌రివేపాకు చెట్టును మ‌న పెర‌ట్లో పెంచుకున్న‌ట్ట‌యితే మందుల షాపును మ‌న ఇంట్లో ఉంచుకున్న‌ట్ట‌నేని నిపుణులు చెబుతున్నారు. క‌రివేపాకులో ఐర‌న్, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్, పిండి ప‌దార్థాలు, ప్రోటీన్లు పుష్క‌లంగా ఉన్నాయి. పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు క‌రివేపాకు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. క‌రివేపాకును తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కంటి ఆరోగ్యాన్ని పెంచ‌డంలో క‌రివేపాకు దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. కంటి చూపును పెంచ‌డంలో, మెద‌డును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో క‌రివేపాకు స‌మ‌ర్థ‌వంతంగా పని చేస్తుంది. క‌రివేపాకును రోజు వారి ఆహారంలో తీసుకోవ‌డం మాన‌సిక ఒత్తిడి త‌గ్గుతుంది. వేవిళ్ల‌తో బాధ‌పడుతున్న గ‌ర్భిణీ స్ర్తీలు క‌రివేపాకు ర‌సంలో రెండు స్పూన్ల నిమ్మ‌ర‌సం కొద్దిగా తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల వెంట‌నే వేవిళ్లు త‌గ్గిపోతాయి.

Curry Leaves take them on empty stomach for these benefits
Curry Leaves

నోటిపూతతో బాధ‌ప‌డే వారు రోజూ రెండు క‌రివేపాకు ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల నోటిపూత నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అన్నీ వ‌య‌సుల వారికి కూడా క‌రివేపాకు దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. న‌రాల బ‌ల‌హీన‌త‌తో బాధ‌ప‌డే వృద్ధుల‌తో సహా అంద‌రికి ఇది ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు రోజూ ప‌ర‌గ‌డుపున నాలుగు క‌రివేపాకు ఆకుల‌ను న‌మిలి తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అంత‌మోందుతుంది. మ‌న‌లో చాలా మంది కంప్యూట‌ర్ ల ముందు కూర్చొని ప‌ని చేసే వారు ఉంటారు. ఇలా ప‌ని చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు ఒత్తిడికి గురి అవుతాయి. ఇలా కంప్యూట‌ర్ ల ముందు కూర్చొని ప‌ని చేసే వారు రోజూ ఇంటికి వెళ్ల‌గానే క‌రివేపాకు ఆకుల‌ను నీటితో శుభ్రం చేసి క‌ళ్ల మీద పెట్టుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఒత్తిడితో త‌గ్గ‌డంతో పాటు కంటి చూపు కూడా మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల‌, మాన‌సిక ఒత్తిడి వ‌ల్ల‌, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల చాలా మంది చిన్న వ‌య‌సులోనే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధప‌డుతున్నారు. ఇలా జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నూనెలో క‌రివేపాకును వేసి వేడి చేయాలి. నూనె చ‌ల్లారిన త‌రువాత ఆ నూనెను త‌ల‌కు రాసి మ‌ర్ద‌నా చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు ప్ర‌తిరోజూ చేయ‌డం వ‌ల్ల తెల్ల‌బ‌డిన జుట్టు న‌ల్ల‌గా మార‌తుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. మ‌జ్జిగ‌లో కొద్దిగా క‌రివేపాకు ర‌సాన్ని క‌లిపి తాగినా కూడా జుట్టుకు మేలు క‌లుగుతుంది. రోజూ క‌రివేపాకును తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న బ్యాక్టీరియా న‌శించి ఫంగ‌ల్ ఇన్ ఫెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి.

బ‌ద్ద‌కంతో చాలా మంది బాధ‌ప‌డుతుంటారు. ఇది ఉద‌యం పూట మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వారు నీటిలో ఒక టీ స్పూన్ క‌రివేపాకు ర‌సం, ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సం వేసి క‌షాయంలా చేసుకోవాలి. త‌రువాత అందులో ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌ద్ద‌కం త‌గ్గి ఉత్సాహంగా ఉంటారు. క‌రివేపాకును న‌మిలి తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి తగ్గి చ‌లువ చేస్తుంది. ఇందులో ఉండే ఫినాల్స్ క్యాన్స‌ర్ క‌ణాల‌తో పోరాడి క్యాన్స‌ర్ ను అరిక‌డ‌తాయి. క‌రివేపాకును రోజూ తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే చెడు కొవ్వు స్థాయిలు త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. క‌రివేపాకు పేస్ట్ ను చ‌ర్మం పై మంట, దుర‌ద‌లు ఉన్న చోట రాయ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

ఇన్ని ఉప‌యోగాలు ఉన్న క‌రివేపాకు ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల స్వ‌చ్ఛ‌మైన గాలిని అందిస్తుంది. ఈ చెట్టు నుండి వ‌చ్చే గాలి మ‌న‌కు ఎన్నో వ్యాధుల‌ను రాకుండా చేస్తుంది. ఈ విధంగా క‌రివేపాకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని త‌ప్ప‌కుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts