Erra Ganneru : మన ఇంట్లో రకరకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే అందమైన పూల మొక్కల్లో ఎర్ర గన్నేరు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క శాస్త్రీయ నామం మిరియం ఇండికం. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ విరివిరిగా కనబడుతుంది. చాలా మంది ఈ మొక్కను ఇంటి పెరడుకు అందాన్ని తీసుకు రావడానికే మాత్రమే పెంచుకుంటారు. కానీ ఈ మొక్కలో కూడా ఔషధ గుణాలు ఉంటాయని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ మొక్క ప్రతి భాగం కూడా ఎన్నో ఔషధాల గుణాలను కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ మొక్కలో విష పదార్థాలు కూడా ఉంటాయి. ఈ మొక్కను ఎక్కువగా బాహ్య శరీరం కొరకు మాత్రమే ఉపయోగించాలి.
వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఎర్ర గన్నేరు మొక్కను ఉపయోగించాలి. ఎర్ర గన్నేరు మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. విరోచనాలను తగ్గించడంలో, కడుపులో పురుగులను నశింపజేయడంలో, నొప్పులను తగ్గించడంలో గన్నేరు మొక్క మనకు ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. ఈ మొక్క గురించి పూర్తిగా తెలిసిన వారు అలాగే ఆయుర్వేద నిపుణుల సమక్షంలోనే ఈ గన్నేరు మొక్కను ఎక్కువగా ఉపయోగించాలి. అల్సర్లను తగ్గించడంలో, మూత్రపిండాల సమస్యలను నయం చేయడంలో, ఆస్థమాను తగ్గించడంలో, చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో, గుండె జబ్బులను తగ్గించడంలో కూడా ఎర్ర గన్నేరు మొక్కను ఉపయోగిస్తారు.
ముఖ్యంగా పురుషులకు ఎర్ర గన్నేరు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క వేరు బెరడును సేకరించి మెత్తగా దంచాలి. దీనిని తగినంత ఆవు నెయ్యిలో వేసి నల్లగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఈ నెయ్యిని వడకట్టి గాజు సీసాలోకి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నెయ్యిని పురుషాంగానికి రాసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే అన్ని రకాల లైంగిక సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా ఎర్ర గన్నేరు మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఔషధ గుణాలతో పాటు ఈ మొక్కలో ప్రతి భాగం కూడా విషాన్ని కలిగి ఉంటుంది కనుక దీనిని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని కూడా వారు సూచిస్తున్నారు.