Gachakayalu : పూర్వకాలంలో ఎక్కువగా ఆడిన ఆటల్లల్లో గచ్చకాయల ఆట కూడా ఒకటి. ఒకప్పుడు ఈ ఆట ఆడని ఆడపిల్లలు ఉండరనే చెప్పవచ్చు. కానీ నేటి తరం వారికి ఈ ఆట గురించే తెలియదు. ఈ ఆట ఆడడానికి వాడే గచ్చకాయలు మనకు గచ్చకాయల చెట్టు నుండి లభిస్తాయి. తీర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా ఇవి మనకు లభిస్తాయి. ఈ చెట్టు కాయలు పెద్దగా ముళ్లతో కూడి ఉంటాయి. అయితే చాలా మంది ఇవి ఒక ఆట వస్తువుగానే తెలుసు. కానీ గచ్చకాయ చెట్టును ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ గింజలు చేదుగా ఉంటాయి. గింజల లోపల పచ్చటి ద్రవం ఉంటుంది.
ఈ ద్రవంలో వివిధ రకాల పోషకాలు కూడా ఉంటాయి. గచ్చకాయ చెట్టు ఆకులు, కాండం, కాయలు, బెరడు ఇలా ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో వివిధ రకాల ఔషధాల తయారీలో ఈ చెట్టును విరివిరిగా ఉపయోగిస్తారు. శరీరంలో వాత, కఫ దోషాలను తొలగించడంలో గచ్చకాయలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే వీటిని వాడడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ కాయలను వాడడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. కంటి చూపు పెరుగుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. గచ్చకాయల నుండి తీసిన నూనెను బట్టతలపై రాస్తూ ఉండడం వల్ల క్రమంగా జుట్టు రావడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా కడుపులో అల్సర్లను తగ్గించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, కడుపులో పురుగులు నశించేలా చేయడంలో, ఫైల్స్ సమస్యను దూరం చేయడంలో, నరాల వాపులను తగ్గించడంలో కూడా గచ్చకాయలు మనకు సహాయపడతాయి. ఈ విధంగా గచ్చకాయలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని వీటిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.