Henna Plant : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి కారణంగా ఈ సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. జుట్టు పెరగక పోవడం, జుట్టు చిట్లడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారడం, చుండ్రుతో బాధపడడం వంటి వాటిని జుట్టు సంబంధమైన సమస్యలుగా చెప్పవచ్చు. ఈ సమస్యల నుండి బయటపడడానికి రకరకాల షాంపులను, డైలను వాడుతూ ఉంటారు. వీటిని ఉపయోగించడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. ఈ సమస్యలన్నింటినీ మనం ఆయుర్వేదం ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదం ద్వారా జుట్టు సంబంధమైన సమస్యలను ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదంలో ఔషధంగా వాడే గోరింటాకును ఉపయోగించి మనం జుట్టు సంబంధమైన సమస్యలన్నింటి నుంచి బయటపడవచ్చు. గోరింటాకు మనందరికీ తెలుసు. దీనిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. గోరింటాకు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. జుట్టు సంబంధమైన సమస్యలను నయం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే చాలా మంది దీనిని మెత్తగా చేసి వెంటనే తలకు రాస్తూ ఉంటారు. అలా చేయడం వలన ఫలితం తక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా గోరింటాకును మెత్తగా నూరి ఒక రాత్రంతా ఇనుప మూకుడులో ఉంచిన తరువాత తలకు, జుట్టుకు పట్టించాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి.
అంతేకాకుండా ఈ మొక్క ఆకుల రసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు చిట్లడం తగ్గి కాంతివంతగా మారుతుంది. ఈ విధంగా గోరింటాకును ఉపయోగించి జుట్టు సమస్యలన్నింటినీ మనం నయం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫంగల్ ఇన్ ఫెక్షన్ వల్ల గోరు పుచ్చి పోయినప్పుడు గోరింటాకును మెత్తగా నూరి పుచ్చి పోయిన గోరు మీద ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరికాళ్ల మంటలను తగ్గించడంలో కూడా గోరింటాకు ఉపయోగపడుతుంది. దీనిని మెత్తగా నూరి అరికాళ్లకు మందంగా రాయడం వల్ల మంటలు తగ్గుతాయి.
అంతేకాకుండా గోరింటాకును మెత్తగా నూరి రాయడం వల్ల సెగ గడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గి త్వరగా మానుతాయి. కాళ్లు, చేతులు మంటలు పుడుతున్నప్పుడు గోరింటాకు రసంలో పులిసిన బియ్యం కడిగిన నీటిని పోసి మంట ఉన్న చోట రాయడం వల్ల మంటలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులను తగ్గించే గుణం కూడా గోరింటాకుకు ఉంటుంది. గోరింటాకును మెత్తగా నూరి నొప్పులపై పట్టుగా వేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. గోరింటాకును ఉపయోగించి స్త్రీలలో వచ్చే తెల్ల కుసుమ వ్యాధిని కూడా తగ్గించవచ్చు. దీనిని మెత్తగా నూరి యోని రంధ్రానికి రెండు పూటలా రాస్తూ ఉండడం వల్ల రెండు రోజులలోనే తెల్ల కుసుమ వ్యాధి తగ్గుతుంది. గోరింటాకు రసాన్ని తాగడం వల్ల పురుషులలో మూత్రం ద్వారా వీర్యం పడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా గోరింటాకును ఉపయోగించి జుట్టు సమస్యలే కాకండా ఇతర అనారోగ్య సమస్యలను కూడా నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.