Mulla Thotakura : దీన్ని పిచ్చి మొక్క అనుకుంటే.. మీరు పొర‌పాటు ప‌డిన‌ట్లే.. లాభాలు తెలిస్తే.. వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Mulla Thotakura : ముళ్ల తోట‌కూర.. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఇది మ‌న‌కు విరివిరిగా క‌నిపిస్తుంది. ముళ్ల‌ తోట‌కూర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతుంది. దీని కొమ్మ‌ల చివ‌ర్లు ముళ్లు ముళ్లుగా ఉంటాయి. ముళ్ల‌ తోట‌కూర ఆకుప‌చ్చ‌, ఎరుపు, తెలుపు రంగుల‌లో మ‌న‌కు ల‌భిస్తుంది. ఆకుప‌చ్చగా ఉండే ముళ్ల తోట‌కూర ఎక్కువ‌గా మ‌న‌కు దొరుకుతుంది. ఎరుపు రంగులో ఉండే ముళ్ల తోట‌కూర కొంచెం త‌క్కువ‌గా దొరుకుతుంది. తెల్ల‌గా ఉండే ముళ్ల తోట‌కూర ఉత్త‌ర భార‌త‌దేశంలో ఎక్కువ‌గా దొరుకుతుంది. ఈ తోట‌కూర‌ను కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటారు. ఈ ముళ్ల తోట‌కూర కూడా అనేక ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు.

ఈ ముళ్ల తోట‌కూర వేరును సేక‌రించి క‌డిగి ఎండ‌బెట్టి నిల్వ చేసుకోవాలి. దీనిని అవ‌స‌ర‌మ‌యిన‌ప్పుడు నీటితో క‌లిపి మెత్త‌గా నూరి ఆ గంధాన్ని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని అర క‌ప్పు నీటిలో క‌లిపి ఆహారానికి అర గంట ముందు తీసుకుంటూ ఉంటే సెగ‌రోగాలు త‌గ్గుతాయి. ఈ చెట్టు వేరు పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని కొద్దిగా నీటిలో వేసి క‌లిపి ఆ నీటిని గోరు వెచ్చ‌గా చేసి భోజ‌నానికి అర గంట ముందు రెండు పూట‌లా 40 రోజుల పాటు తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల‌లో రాళ్లు ప‌డిపోతాయి. ముళ్ల తోట‌కూర మొక్క మొత్తాన్ని తీసుకుని ముక్క‌లుగా చేసి ఎండ‌బెట్టాలి. ఈ ముక్క‌ల‌ను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి. ఈ బూడిద‌ను గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి మెత్త‌గా నూరి ముఖానికి పై పూత‌గా రాసి అది ఎండే వ‌ర‌కు ఎండ‌లో కూర్చోవాలి. ఈ లేపనం ఎండిన త‌రువాత గోరు వెచ్చని నీటితో క‌డ‌గాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం పై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గిపోతాయి.

Mulla Thotakura is a wonderful plant for us know the benefits
Mulla Thotakura

ముళ్ల తోట‌కూర వేరు పొడి పావు టీ స్పూన్, తేనె ఒక టీ స్పూన్, ప‌టిక బెల్లం పొడి ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని వీటిని ఒక క‌ప్పు బియ్యం క‌డిగిన నీటితో క‌లిపి తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల ఎర్ర‌బ‌ట్ట వ్యాధి త‌గ్గుతుంది. పాము కాటుకు గురి అయిన‌ప్పుడు ఈ మొక్క మొత్తాన్ని దంచి తీసిన ర‌సాన్ని శారీరక బలానికి త‌గిన‌ట్టుగా పావు క‌ప్పు నుండి అర క‌ప్పు మోతాదులో ఇవ్వ‌డం వ‌ల్ల పాటు విషం హ‌రించుకుపోతుంది.

Share
D

Recent Posts