Reddyvari Nanu Balu : మన చుట్టూ ఉండే ఆయుర్వేద మొక్కల్లో రెడ్డి వారి నానుబాలు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతుంది. చాలా మంది దీనిని పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ రెడ్డి వారి నానుబాలు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త మొలలతో బాధపడే వారు వాకుడు చెట్టు ఆకులను, రెడ్డి వారి నానుబాలు మొక్క ఆకులను ఏదైనా కూరలో వేసి వండుకుని తింటూ ఉండడం వల్ల రక్త మొలలు తగ్గుతాయి. చర్మంపై దురదల కారణంగా కురుపులు వచ్చిన వారు ఈ మొక్క రసాన్ని రాయడం వల్ల కురుపులు తగ్గుతాయి. పిప్పి పన్ను సమస్యతో బాధపడే వారు రెడ్డి వారు నానుబాలు మొక్క వేరును నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పిప్పి పన్నుపై ఉంచడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. ఈ మొక్క రసానికి పంచదారను కలిపి తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడే స్త్రీలు రెడ్డి వారి నానుబాలు మొక్క ఆకుల రసంలో మిరియాల పొడిని కలిపి నెలసరి సమయంలో మూడు రోజుల పాటు తీసుకుంటూ చప్పటి పత్యాన్ని చేయడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది.
చలి జ్వరాలతో బాధపడే వారు ఈ మొక్క ఆకులను మిరియాలతో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని ఉదయం పూట తీసుకుంటూ ఉండడం వల్ల చలి జ్వరాలు తగ్గుతాయి. ఈ మొక్కను తుంచినప్పుడు పాలు కారుతాయి. ఈ పాలను కళ్లల్లో వేసుకోవడం వల్ల కంటి పూల సమస్య తగ్గుతుంది. ఈ విధంగా పిచ్చి మొక్కగా భావించే రెడ్డి వారి నానుబాలు మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.