Konda Pindi Plant : మూత్ర పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించే మొక్క ఇది.. క‌లుపు మొక్క అనుకుంటే పొర‌పాటు..!

Konda Pindi Plant : కొండ‌పిండి మొక్క‌.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. సంక్రాంతి పండ‌గ రోజు ముగ్గులో ఎక్కువ‌గా ఈ కొండ‌పిండి మొక్క‌ను ఉంచుతారు. మ‌న‌లో చాలా మంది ఈ మొక్క‌ను క‌లుపు మొక్క అని తేలిక‌గా తీసుకుంటారు. కానీ ఈ మొక్కలో ఉండే ఔష‌ధ గుణాల గురించి తెలిస్తే మ‌నం ఆశ్చ‌ర్య పోవాల్సిందే. మ‌న‌కు వ‌చ్చే మూత్రపిండాల స‌మ‌స్య‌ల‌న్నింటినీ న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Konda Pindi Plant amazing health benefits
Konda Pindi Plant

ఈ కొండ‌పిండిని మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో ఉండే రాళ్లు క‌రిగిపోయి మూత్ర పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కొండ‌పిండి వేర్లు, గోక్షూర వేర్లు, ఒలిమిడి వేర్లు, ఉత్త‌రేణి వేర్లను స‌మ‌పాళ్ల‌లో తీసుకుని మెత్త‌గా నూరి కుంకుడు గింజ ప‌రిమాణంలో మాత్ర‌లుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్ర‌ల‌ను మంచినీటితో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల‌లో రాళ్ల స‌మ‌స్య న‌యం అవుతుంది.

త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి నుదుటికి ప‌ట్టులా వేయ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. గ‌ర్భిణీ స్త్రీలు మూత్ర బిగింపు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ మొక్క ఆకుల‌ను బియ్యం క‌డిగిన నీటితో నూరి ఆ మిశ్ర‌మానికి పంచ‌దార‌ను క‌లిపి తీసుకోవడం వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గి మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మూత్రం ఆగుతూ వ‌చ్చే వారు ఈ మొక్క వేరు ర‌సంలో య‌వ‌క్షారాన్ని క‌లిపి వాడ‌డం వ‌ల్ల మూత్రం ధారాళంగా వ‌స్తుంది.

అంగ‌శూల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కొండ‌పిండి మొక్క ర‌సంలో జీల‌క‌ర్ర చూర్ణాన్ని క‌లిపి వాడ‌డం వ‌ల్ల అంగ‌శూల స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ విధంగా కొండ‌పిండి మొక్క మన‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts