Ummetha : ఈ ఆకు నిజంగా బంగారం లాంటిదే.. ఈ రహస్యాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు..!

Ummetha : చుట్టూ మన పరిసరాల్లో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో ఉమ్మెత్త ఒకటి. ఎన్నో రకాల మందులను వాడినా తగ్గని మొండి వ్యాధులను ఉమ్మెత్త తగ్గించగలదు. అందుకనే దీనికి ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాధాన్యత కల్పించారు. దీన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

Ummetha is really like gold amazing health benefits and remedies

ఉమ్మెత్త మొక్కలను సహజంగానే చాలా మంది చూసి ఉంటారు. తెల్లని పువ్వులు, ముళ్లు, కాయలతో ఇవి మనకు కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా వినాయకుడి పూజలకు ఉపయోగిస్తుంటారు. ఉమ్మెత్తలో కొన్ని రకాలు ఉన్నాయి. కొన్ని ఉమ్మెత్త చెట్లకు వంకాయ రంగు పువ్వులు పూస్తాయి.

ఉమ్మెత్త ఆకులను మోకాళ్ల నొప్పి తగ్గించేందుకు ఉపయోగిస్తారు. వాటిపై కొద్ది నువ్వుల నూనె రాసి వేడి చేసి కట్టులా కడితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే సెగ గడ్డలు, వేడి కురుపులు, స్త్రీలలో స్తనాల వాపులు.. తదితర సమస్యలకు ఉమ్మెత్త ఆకులు పనిచేస్తాయి. వీటిని సేకరించి శుభ్రంగా కడిగి నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే కట్టు కట్టాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా నొప్పులు తగ్గిపోతాయి.

తలనొప్పి ఉన్నవారు నుదుటిపై కొద్దిగా నువ్వుల నూనె రాసి అనంతరం దానిపై ఉమ్మెత్త ఆకును పెట్టుకోవాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది.

అధిక బరువుతో బాధపడుతున్నవారు కొవ్వు ఉన్న చోట ఈ ఆకును కట్టులా కడుతుండాలి. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

పిచ్చికుక్క కాటుకు ఉమ్మెత్త అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. ఈ చెట్టు ఆకులను తీసుకుని నూరి ముద్దలా చేయాలి. దాన్ని కుక్క లేదా కోతి కరిచిన చోట కట్టులా కట్టవచ్చు. లేదా రసం తీసి మర్దనా చేయాలి. దీంతో విష ప్రభావం తగ్గుతుంది.

ఎండిన నల్ల ఉమ్మెత్త ఆకుల పొగను పీలిస్తే ఆస్తమా నుంచి బయట పడవచ్చు. శ్వాస సరిగ్గా ఆడుతుంది.

మొలల సమస్య ఉన్నవారు ఈ చెట్టు వేర్లను తీసుకుని మెత్తగా నూరి మొలలు ఉన్న చోట రాస్తుండాలి. దీంతో మొలలు తగ్గుతాయి.

నల్ల ఉమ్మెత్త ఆకుల రసాన్ని అరికాళ్లకు రాస్తుండాలి. దీంతో తిమ్మిర్లు, మంటలు తగ్గుతాయి. జుట్టు కుదుళ్లకు బాగా తగిలేలా నల్ల ఉమ్మెత్త ఆకుల రసాన్ని రాయాలి. దీంతో పేను కొరుకుడు తగ్గుతుంది. జుట్టు మళ్లీ వస్తుంది.

ఉమ్మెత్త ఆకుల రసాన్ని పూతలా రాస్తుంటే గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. తలలో కురుపులు ఉన్నవారు ఆముదంలో ఈ ఆకుల రసాన్ని కలిపి రాయాలి. దీంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

అయితే ఉమ్మెత్త ఆకుల రసం ఎట్టి పరిస్థితిలోనూ శరీరం లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ చెట్టు విష పూరితమైంది. కనుక దీని ఆకులు లేదా వేర్ల రసాన్ని శరీరం బయటి సమస్యల కోసం మాత్రమే వాడాలి. లోపలికి తీసుకోరాదు. పిల్లలకు ఉమ్మెత్తను దూరంగా ఉంచాలి.

Share
Editor

Recent Posts