Amaranth Leaves : మనకు మార్కెట్‌కు వెళితే అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు కనిపిస్తాయి. ఈ క్రమంలోనే ఎవరైనా తమకు నచ్చి కూరగాయలు లేదా ఆకుకూరలను కొనుగోలు చేసి తింటుంటారు. అయితే చాలా మందికి తోటకూర అంటే అంతగా నచ్చదు. ఇతర ఆకుకూరలను చాలా మందే తింటారు. కానీ తోటకూరను చాలా తక్కువగా తింటారు. ఇది కాస్త పసరు వాసన వస్తుందని కొందరు దీన్ని తినేందుకు ఇష్టపడరు. కానీ వాస్తవానికి తోటకూర మనకు అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు, పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలోనే తోటకూర తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూరలో విటమిన్లు ఎ, సి, కె లతోపాటు ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ల సమస్యలు తగ్గుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గుతుంది. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
తోటకూర గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని నియంత్రిస్తుంది. గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా బీటాకెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను రక్షిస్తాయి. ఒత్తిడి, వాపుల నుంచి రక్షిస్తాయి. అధిక బరువు తగ్గాలనుకుంటున్నవారు తోటకూరను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. తోటకూరలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పోషక పదార్థం అని చెప్పవచ్చు.
తోటకూరలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి తోటకూర వరమనే చెప్పవచ్చు. తోటకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల తోటకూరను తింటుంటే ఐరన్ పుష్కలంగా లభించి రక్తం అధికంగా తయారవుతుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. షుగర్ సమస్య ఉన్నవారు రోజూ 20 ఎంఎల్ మోతాదులో తోటకూర జ్యూస్‌ను తాగినా చాలు షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే తోటకూరలో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలను బలంగా మారుస్తుంది. ఇలా తోటకూరతో ఎన్నో లాభాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా దీన్ని మీరు మీ ఆహారంలో భాగం చేసుకోండి.