Women Lipstick : చాలా మంది మేకప్ వేసుకునే మహిళలు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా వేసుకుంటారు. లిప్‌స్టిక్ లేకుండా మేకప్ పూర్తికాదు. మేకప్ అయినా కొందరు మానేస్తారేమో కానీ లిప్‌స్టిక్ వేసుకోవడం మాత్రం మానరు. ఈ క్రమంలోనే మార్కెట్‌లో మహిళలకు అనేక రకాల కంపెనీలకు చెందిన వెరైటీ లిప్‌స్టిక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమ అభిరుచులకు అనుగుణంగా ఉండే లిప్‌స్టిక్‌లనే వేసుకుంటుంటారు. అయితే మనస్తత్వ శాస్త్రం ప్రకారం మహిళలు వేసుకునే లిప్‌స్టిక్ కలర్‌ను బట్టి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో సులభంగా చెప్పేయవచ్చట. అవును, ఇది నిజమే. మరి ఆ వివరాలు ఏమిటో ఒకసారి చూద్దామా.
ఎరుపు రంగులో ఉండే లిప్ స్టిక్‌ను వేసుకునే మహిళలు చాలా ఉత్సాహంగా ఉంటారట. వీరికి ధైర్యం, ఏ విషయంలో అయినా సరే నమ్మకం ఎక్కువగా ఉంటాయట. వీరు ఎందులో అయినా సరే దృఢ నిశ్చయంతో నిర్ణయాలు తీసుకుంటారట. ఒక్కసారి ముందుకు అడుగు వేశాక మళ్లీ వెనుకడుగు వేయరట. అలాగే వీరు చాలా శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటారట. వీరు తమకు అన్యాయం జరిగితే అసలు సహించలేరట. ఎదురు తిరిగి పోరాడుతారట. అలాగే ధైర్యసాహసాలను కలిగి ఉంటారట. అనుకున్నది నెరవేర్చుకునే వరకు పోరాడుతూనే ఉంటారట.
లైట్ పింక్ కలర్‌లో ఉండే లిప్ స్టిక్‌ను వేసుకునే మహిళలు క్లాసిక్ లుక్‌లో ఉండేందుకు ఇష్టపడతారట. వీరు చాలా జాలి, దయ కలిగి ఉంటారట. మనస్సంతా ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచుకుంటారట. వీరు ఇతరుల పట్ల చాలా మర్యాదగా, మంచిగా ప్రవర్తిస్తారట. ఎప్పుడూ సరదాగా ఉంటారట.
పింక్ కలర్‌లో ఉండే లిప్‌స్టిక్‌ను ధరించే మహిళలు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. అమాయకులుగా ఉంటారు, అందరినీ నవ్విస్తారు, ఇలాంటి వారిని అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. బ్రౌన్ కలర్ లిప్‌స్టిక్ ధరించే మహిళలు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. వీరు ప్రత్యేకంగా నిలుస్తారట. వీరికి మాటకారితనం ఎక్కువే. ఇతరులను చాలా బాగా అంచనా వేయగలుగుతారు. కుటుంబానికి విలువ ఇస్తారట.